Home Cinema Hi Nanna : హాయ్ నాన్న గురించి సెన్సార్ వాళ్ళు.. అందుకే నానికి అంత ధైర్యమా?

Hi Nanna : హాయ్ నాన్న గురించి సెన్సార్ వాళ్ళు.. అందుకే నానికి అంత ధైర్యమా?

the-censor-board-gave-a-clean-u-certificate-for-the-hi-nanna-movie

Hi Nanna Censor certificate : నాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా రూపొందించిన చిత్రం హాయ్ నాన్న. నాని ప్రస్తుతం మంచి స్పీడ్ లో ఉన్నాడు. దసరా సినిమాతో తన రేంజ్ ని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకొని వెళ్ళాడు. 100 కోట్ల సినిమా రికార్డులోకి దూసుకుపోయాడు. దీనితో నాని సినిమా అంటే కొంత ( Hi Nanna Censor certificate ) ప్రత్యేకత, కొంత అంచనాలు పెరిగాయి.అయితే ఇదే క్రమంలో దసరా సినిమా తర్వాత నాని చేస్తున్న హాయ్ నాన్న సినిమాపై కూడా అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఎందుకంటే.. మొదట ఈ సినిమాని ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినా కూడా.. ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత., సాంగ్స్ వింటున్న తర్వాత నెమ్మదిగా ఈ సినిమాపై మంచి పాజిటివ్ టాక్ ఏర్పడడం మొదలైంది.

Nani-movie-Hi-Nanna-censor-certificate-details

ఇదిలా ఉంటే ఈ సినిమాపై సెన్సార్ వాళ్ళ సర్టిఫికెట్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని చూసి క్లీన్ యు సర్టిఫికెట్ ని ఇచ్చారు. దీనితో పిల్లలు, పెద్దలు కుటుంబ సమేతంగా ఈ సినిమాని చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా సెంటిమెంట్ సినిమాగా కనిపిస్తుంది. ఇక డిసెంబర్ నెలలో పోటీపడుతున్న సినిమాలు అంటే నిన్న ( Hi Nanna Censor certificate ) డిసెంబర్ ఒకటో తేదీని రిలీజ్ అయిన యానిమల్ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంతటి అంచనాలతో అందరూ ఎదురు చూశారు ఇంచుమించుగా పరవాలేదు అనిపించేలాగా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కాకపోతే ఈ సినిమా విపరీతమైన వైలెన్స్ మరియు విపరీతమైన రొమాన్స్ అన్ని ఉండగా.. అంతేకాకుండా ఏ సర్టిఫికెట్ సినిమా అయింది కాబట్టి.. ఈ సినిమాని పిల్లలతో కలిసి కుటుంబం అంతా చూడగలిగే సినిమా కాదు. దీన్ని కేవలం పెద్దవాళ్ళు మాత్రమే వెళ్లి చూడాలి.

See also  Faima : ఫైమా లవర్ కి వేరే అమ్మాయితో పెళ్లి.. ఫైమా గురించి ఊహించని నిజాలు చెప్పిన లవర్..

Nani-movie-Hi-Nanna

అలాగే ఇక నాని సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ ఉంటే.. దాని తర్వాత ప్రభాస్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సలార్ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఒకపక్క యానిమల్, మరోపక్క సలార్ సినిమా ఈ రెండిటి మధ్యలో రిలీజ్ అయిన ( Hi Nanna Censor certificate )నానికి చాలా పెద్ద పోటీనే వీళ్ళిద్దరూ. కానీ సలార్ సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ చూస్తే అది కూడా విపరీతమైన వైలెన్స్ కనిపిస్తుంది. ఫైట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ఫ్యామిలీ ఎమోషన్ గాని, సెంటిమెంట్స్ గాని ఎక్కడ కనిపించలేదు. మరోపక్క కేజీఎఫ్ కి దగ్గరగా ఆ సినిమా ఉంది. కాబట్టి ఆ సినిమాలో ఒక కొత్తదనం గాని, కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే విధానం గాని ట్రైలర్లో అయితే కనిపించలేదు.

See also  Bhola Shankar Review : భోళాశంకర్ లో దర్శకుడి చీప్ ట్రిక్స్ తో చిరంజీవిని చీప్ చేసిన సీన్స్ ఇవే.. రివ్యూ మరియు రేటింగ్..

Nani-movie-Hi-Nanna-censor

ఇకపోతే ఇటు అనిమల్ సినిమా అటు సలార్ సినిమా రెండు కూడా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే సినిమాలు కావని ప్రేక్షకులకు గాని అనిపించిందా.. దానితో అందరూ కుటుంబ సమేతంగా వెల్లాలనుకుంటే ఎన్నుకునే ఒకే ఒక సినిమా నాని సినిమా అవుతుంది. హాయ్ నాన్న.. సెంటిమెంట్ ని ఎంటర్టైన్ చేయగలిగే సినిమాని క్లియర్ గా టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ టీజర్, ట్రైలర్ లో చూపించినంత అద్భుతంగా సినిమా మొత్తం రెండున్నర గంటలు తీగలిగితే కచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ సినిమా బోర్ కొట్టించినా, ల్యాగ్ అనిపించినా, మరి సీరియల్ టైపులో అనిపిస్తే మాత్రం ఆ సినిమాను పక్కకు తోసేసి అనిమల్, సలార్ వైపు పెళ్ళే అవకాశం తప్పా.. లేదంటే కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే సినిమా హాయ్ నాన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే బహుశా నాని.. సందీప్ రెడ్డి వంగ దర్శకతంలో రూపొందిన యానిమల్ సినిమాని, అటు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాని కూడా ఎదుర్కొని.. మధ్యలో తాను రావడానికి కారణం, అంత ధైర్యం ఈ క్యాలిక్యులేషన్ ఏమో..