Andhra Pradesh : ప్రజలకు చాలా వరకు సమస్యలు తీరాలంటే మొదట తీరాల్సిన సమస్య నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య ఉన్నంతకాలం అనేక సమస్యలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఎందుకంటే.. మనిషి మనుగడ సాగాలి అంటే సరైన ఆర్థిక పరిస్థితి ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగుండాలి ( The Andhra Pradesh Government announced good news for the unemployed ) అంటే ప్రతి ఒక్కరికి చేతినిండా పని ఉండాలి. ఆంద్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు తలకిందులు అవ్వడానికి ముఖ్య కారణం ఈ నిరుద్యోగ సమస్య కూడా. వైసిపి ప్రభుత్వం ఒక్కసారిగా 11 సీట్లకు మాత్రమే పరిమితమై, కూటమికి ప్రజలు అధిక మెజార్టీని ఇచ్చి గెలిపించడానికి కారణం.. నిరుద్యోగ సమస్య కూడా ఒకటనే చెప్పుకోవచ్చు.
కూటమి ప్రభుత్వం వస్తే నిరుద్యోగ సమస్యను చాలావరకు తగ్గిస్తారని, సాధ్యమైనంత వరకు ఉద్యోగాలు కల్పించడానికి కావలసిన అవకాశాలు ఇచ్చే కంపెనీలను ఆంద్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు తరలి తీసుకువస్తాడని నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ( The Andhra Pradesh Government announced good news for the unemployed ) నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించుకోవడం కోసం ప్రతి నిరుద్యోగ కి 10 లక్షల రూపాయలు ఉపాధిలోను ఇప్పించడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే అది ఇంతవరకు మొదలవలేదు గాని ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఒక శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ తో పాటు టీచర్ ఎలిజిబిలిటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది.
వీళ్ళ నిమిత్తం ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుమూలంగా మెగా డీఎస్సీ డేటా ఉచిత కోచింగ్ లోగోను.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ( The Andhra Pradesh Government announced good news for the unemployed ) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ ఐదేళ్లలో తీర్చిదిద్ద పడుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రామచంద్రపురం లో బ్లడ్ టెస్ట్ లు చేసే లేబరేటరీలో ఫీజులు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారని తెలుస్తుందని, అలా తీసుకోకుండా అన్ని కూడా తగ్గించి ఫీజులు తీసుకోవాలని చెప్పకొచ్చారు ఒకవేళ చెప్పిన మాట వినకుండా ఫీజులు ఎక్కువగా తీసుకుంటే చివరకు ఈ టెస్ట్లన్నిటికి ల్యాబరేటరీ నేనే పెడతానని చెప్పుకొచ్చారు. ఇంకా రామచంద్రపురం లో ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు.