Home Cinema Actress Mrunal: అందుకోసమే సుసైడ్ చేసుకోవాలి అనుకున్నదా మృణాల్.?

Actress Mrunal: అందుకోసమే సుసైడ్ చేసుకోవాలి అనుకున్నదా మృణాల్.?

Actress Mrunal: రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారే వాళ్లను అతి తక్కువ మందిలో కొద్ది మందిని చూస్తూ ఉంటాము.. అలా సీతా రామమ్ చిత్రంతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయి ప్రస్తుతం ఇటు బాలివుడ్ నుంచి అటు టాలీవుడ్ వరకు తన హవా కొనసాగిస్తూ సౌత్ టు నార్త్ లో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. ఇక ఇటీవలే ఆమె పుట్టిన రోజు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆమెకు మన సైట్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మృణాల్ ఠాకూర్ 1992వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖున జన్మించింది. దాంతో ఆమె 30వ ఏడు పూర్తిచేసుకుని ప్రస్తుతం 31 ఏటలోకి అడుగుపెట్టబోతున్నది. ఇక మొదట్లో ఎన్నో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఆ తర్వాత పలు సీరియల్ లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు పొందుకొని

See also  Sai Pallavi Sister: సాయి పల్లవి చెల్లి సినిమాల్లోకి రాకపోవడానికి ఆ హీరో వేధింపులే కారణమా.?

thats-why-actress-mrunal-thought-to-commit-suicide

బుల్లితెర ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకొని మరాఠీలో తనదైన శైలిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మూటగట్టుకుని నటన మీద మరింత ఆసక్తితో ఎందరో దర్శక నిర్మాతలను పట్టుకొని మొత్తానికి అయితే 2014 సంవత్సరంలో విట్టి దండు అనే మరాటి చిత్రంతో ఇండస్ట్రీలో కాలు పెట్టింది ఈ మరాటి బ్యూటీ.. ఇక ఈ చిత్రం అనంతరం బాలీవుడ్లో లవ్ సోనియా అనే చిత్రంతో రంగ ప్రవేశం చేసింది. కాగా ఈ చిత్రంలో తాను నటించిన పాత్ర వేశ్య పాత్ర.. ఈ చిత్రం అంతగా ఆశించిన స్థాయిలో స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయినప్పటికీ.. విమర్శకుల చేత ప్రశంసలు మాత్రం దక్కాయనే చెప్పాలి. ఇక ఆ తర్వాత సీతా రామమ్ చిత్రంతో రాత్రికి రాత్రి టాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండియాలో అన్ని భాషలలో ఈ చిత్రం విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో..

See also  Chiranjeevi: అప్పట్లో కుర్రాలని హీట్ ఎక్కించిన పవన్ భూమిక సీన్ రిపీట్ చేయనున్న చిరు శ్రీముఖి

thats-why-actress-mrunal-thought-to-commit-suicide

ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నది. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి అడుగుపెడితే.. ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలలో తను చెప్పిన ఒకే ఒక మాట ఇలాంటి సక్సెస్ నాకు ఈ ఒక్క రోజుతో రాలేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఫలితం ఈ రోజు ఈ సక్సెస్ అంటూ చెప్పుకొచ్చింది.. ఇక ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉన్నాయట.. ఒకానొక సమయంలో తాను సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆలోచించిందట. మరి ఎందుకు మృణాల్ అలాంటి నిర్ణయం తీసుకుందో చూద్దాం. మొదట మరాఠి, హిందీ సీరియల్ లో నటిస్తున్న సమయంలో సినిమాలపై మక్కువ ఎక్కువ ఉండేదట..

thats-why-actress-mrunal-thought-to-commit-suicide

హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలు కనేదట.. ఆ కలలు నిజం చేసుకోవాలని ప్రయత్నంలోనే చాలా మంది దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్ళగా నీకేం నటన వస్తుందంటూ చాలా హేళన చేసేవారట. నువ్వు ఒక సీరియల్ యాక్టర్ వి హీరోయిన్ అవ్వాలని కలలు కంటున్నావ్.? అంటూ ఎంతో చీప్ గా మాట్లాడే వారంట. ఇక వాళ్లనే మాటలని భరించలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నదట.. అలా ఎందరో మాటలు దిగమింగుకొని దశాబ్ద కాలం పాటు తను చేసిన పోరాట ఫలితమే సీతారామమంతో తన ముందు కెరియర్ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంతో మృణాల్ ఠాకూర్ (Actress Mrunal) తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా.. ప్రస్తుతం ముందుకు తీసుకు పోతుంది. ఇంకా ఇటీవలే తను నటించిన లస్ట్ స్టోరీ టూ లో తన అంద చందాలను ఆరబోసి ఎంతగానో అలరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.