
Rajamouli – Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డుని తెలుగు సినిమా ఇండస్ట్రీకి రప్పించి.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి బిజీగా ఉన్న దర్శకుడు రాజమౌళి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి ఒక సినిమా చేస్తూ ఉండగా ఆ సినిమా గురించి మాట్లాడుకోని వారంటూ ఉండరు. ఆ సినిమా ప్రతి అప్డేట్ ని ( Villain for Rajamouli and Mahesh Babu ) ఎంతో ఆసక్తికరంగా చూస్తారు. అలాగే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటా అని ఆలోచించే పనిలో అభిమానులు పడగానే.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చెప్పినా కూడా ఇంకా దాని షూటింగ్ మొదలు పెట్టకుండా.. అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యేలాంటి వార్తలు వస్తున్నాయి.
అలాగే మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళితో కలిసి ఆయన సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా హాలీవుడ్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ.. కథని అన్నిటిని ( Villain for Rajamouli and Mahesh Babu ) చాలా బాగా ప్రిపేర్ చేసుకుంటున్నాడంట రాజమౌళి. ఈ సినిమా కథపై విజయేంద్రప్రసాద్ కసరత్తు చేస్తున్నారంట. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందించబోయే చిత్రంలోని ఇంతవరకు హీరోయిన్ ఎవరనేది తెలియలేదు కానీ.. ఈ సినిమాలో మహేష్ బాబుకు విలన్ గా ఒక లేడీ హీరోయిన్ మాత్రం పవర్ఫుల్ గా పెట్టాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడు అంట. ఆ లేడీ విలన్ ఎవరిని పెట్టాలా అని ఆలోచిస్తుండగా.. ముందుగా ( Villain for Rajamouli and Mahesh Babu ) ఐశ్వర్యరాయ్ ని అనుకున్నారంట. మరి రాజమౌళి ఐశ్వర్యారాయ్ ని వెళ్లి అడిగారో లేదో తెలియదు గాని.. మళ్లీ ఐశ్వర్యారాయ్ ని క్యాన్సిల్ చేసుకుని.. కాజల్ అగర్వాల్ ని మహేష్ బాబుకి లేడీ విలన్ గా చాలా పవర్ ఫుల్ గా పెట్టాలని రాజమౌళి అనుకుంటున్నారంట. కాజల్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించింది.
మగధీర సినిమాలో కాజల్ పాత్రని, దాని ప్రాముఖ్యతని, అందులో ఆమె నటనని ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు.అక్కడి నుంచి కాజల్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి, అనేక సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం కాజల్ కి రావడం అంటే నిజంగా అదృష్టమని అనుకోవాలి. కాకపోతే రాజమౌళి సినిమాలో విలన్ .. హీరో కంటే చాలా పవర్ఫుల్గా ఎప్పుడు కనిపిస్తాడు. అలాంటిది మహేష్ బాబుకి విలన్ గా కాజల్ అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాజల్ ఫేస్ చాలా నార్మల్గా, సాదాసీదాగా ,అమాయకత్వంగా కనిపిస్తుంది. అలాంటి ఆమెను విలన్ గా ఎలా చూపిస్తాడు. రాజమౌళి అసలు కాజల్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని కొందరు నెటిజనులు అనుకుంటున్నారు. కానీ రాజమౌళికి ఉన్న గొప్ప పేరు జక్కన్న.. ఆయన ఏ శిల్పాన్నైనా ఎలా చెక్కాలనుకుంటే అలా చక్కగా చెక్కుతాడు. అలాగే మరి కాజల్ ని అంత పవర్ఫుల్ విలన్ గా ఎలా చూపిస్తాడో చూడాలి. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే కాజల్ మాత్రం వెరీ లక్కీ అనే అనుకోవాలి.