RaviTeja: సినిమా ఇండస్ట్రీ లో బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలే ఎందరో సరైన హిట్ లేక బొక్క బోర్లా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క హిట్ కోసం పరిగాపులు కాచుక్కూర్చున్నారు. కానీ అదే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది లేకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశం సద్వినియోగ పరుచుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా నిలిచిన వాళ్లలో మాస్ మహారాజ రవి తేజ ఒకరు. ఇక ఆయన కెరీర్ తోలి నాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కాలం పని చేసిన విషయం అందరికీ తెలిసిందే..
ఇక ఎలాంటి రికమండేషన్ అనేది లేకుండా తన సొంత పట్టుదల తో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా తనేంటో నిరూపించుకున్నాడు. ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయినటువంటు కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ, కే రాఘ వేంధర్ రావు ఇలా ఎందరో బడా డైరెక్టర్ల తో ఆయన పని చేశాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణం లో ఇండస్ట్రీ లో ఎన్నో అవమానాలు గురయ్యాడు. వాటన్నిటిని సవాళ్లుగా తీసుకొని ఎన్ని అవమానాలు ఎదురైనా వాటన్నిటిని మనస్ఫూర్తిగా భరించాడు..
మనసులో ఒకటే కోరుకున్నాడు రాబోయేది మన రోజులే అని ఎన్ని అవమానులైనా దిగమింగుకొని తట్టుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని జారవించకుండా పట్టు వదలని విక్రమార్కుడు వలె వాటిని నిరూపించుకునే ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ కారణం చేత నేడు ఈ స్థాయిలో ఉన్నాడు. అయితే గతంలో ఇంటర్వ్యూలో భాగంగా రవి తేజ పాల్గొన్నప్పుడు తన జీవితం తొలి నాళ్ళలో ఎదురైన వచ్చేది జ్ఞాపకాన్ని చెప్పాల్సి వచ్చింది. ఇక ఆ విషయం చెబుతూ ఎంతో బాధపడ్డాడు రవితేజ. ఇక ఆ విషయం ఏంటంటే ఓ ప్రముఖ దర్శకుని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో టాప్ హీరోయిన్ కి షార్ట్ కోసం వేసుకోవాల్సిన చెప్పులు లేకపోవడంతో ఆ డైరెక్టర్ చాలా చిరాకు పడ్డాడు.
ఇవన్నీ చూసుకోవాల్సిందే అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఏడి ఏడున్నాడాయన రవితేజ ఏం చేస్తున్నాడు.? అని అంటూ వాడిని పిలవండి వాడిని సెట్ లోకి అంటూ అందరి ముందు ఆ డైరెక్టర్ గట్టిగా అరిచాడట. అప్పుడు రవితేజ నేను మీరిచ్చిన చెప్పులే ఇచ్చాను సార్ ఆమెకి అవి వేసుకుని షార్ట్ కి వస్తుందని అనుకున్నాను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదని చెప్పాడట. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ని తింటే ధైర్యం లేక రవితేజ పైనే ఇష్టం వచ్చినట్లు అరి చేశాడట. అప్పుడు స్వయంగా రవి తేజ (RaviTeja) నే ఆమె పాదాలను తాకి మరి చెప్పులు పట్టుకుని వెళ్లి పక్కన పడేసి డైరెక్టర్ కి ఇచ్చిన చెప్పులను తొడిగాడట.. షార్ట్ అయిపోయాక తన వల్ల అన్ని తిట్లు తిన్నందుకు రవితేజకి ఆ టాప్ హీరోయిన్స్ ఐటం క్షమాపణలు చెప్పిందట.