Home Cinema Prabhas : ఒక్క రోజులో 500 కోట్లు తేబోయే ప్రభాస్.. ఎలానో తెలుసా?

Prabhas : ఒక్క రోజులో 500 కోట్లు తేబోయే ప్రభాస్.. ఎలానో తెలుసా?

thammareddy-comments-on-prabhas-movie-project-k

Prabhas : సినిమా రంగం అంటేనే అది ఎంత పెద్ద వ్యాపారం మనందరికీ తెలిసిందే. ఈ రంగంలో ఒక సినిమాతో అపర కోటీశ్వరులైన వాళ్ళు ఉంటారు.. తీవ్రమైన నష్టంతో చావు బతుకుల మధ్య కొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ( Prabhas movie Project K ) ఈ రంగంలో నిలదొక్కుకోవాలని, నిలబడాలని అందరూ ట్రై చేస్తూనే ఉంటారు. ఇటీవల కొంత కాలం నుంచి భారతీయ సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మంచి వ్యాపారం జరుగుతుంది. సినిమా మొదటి రోజే విపరీతమైన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఒకవేళ సినిమా యావరేజ్ అయినా కూడా మినిమం కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. మరి డిజాస్టర్ అయితే తప్ప డబ్బు పోయే అవకాశాలు కనబడడం లేదు.

thammareddy-comments-on-prabhas-movie-project-k

ప్రపంచం మొత్తంగా ఒకేరోజు సినిమాని రిలీజ్ చేయడం.. సినిమా రావడానికి ముందే టీజర్, ట్రైలర్ మీడియా ద్వారా విపరీతమైన హైట్ క్రియేట్ చేయడం.. మొదట సెలవ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లోనే సినిమా బడ్జెట్ సగం డబ్బు వచ్చేసేలా ( Prabhas movie Project K ) చూసుకోవడం అందరికీ ఈ రోజుల్లో అదొక తెలివైన బిజినెస్ గా మారింది. ఆ క్రమంలోనే కొన్ని సినిమాలు మంచి కలెక్షన్స్ తొలి రోజులోనే తీసుకొచ్చిన ఎన్నో ఉన్నాయి. ఆదిపురుష్ మొదటి రోజే 140 కోట్ల వసూలు చేసింది. బాహుబలి సాహో తర్వాత మళ్లీ ప్రభాస్ సినిమాలకు ఆ స్థాయిలో కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమా ఆదిపురుష్. అయితే సీనియర్ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రభాస్ సినిమా గురించి ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకి ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపింది.

See also  Ranbir Kapoor: అనిమల్ సినిమా వలన రన్బీర్ కపూర్ కి అలాంటి ట్రీట్మెంట్ లేని హెల్త్ ఇష్యూ ఉందని బయట పడిందట..

thammareddy-comments-on-prabhas-movie-project-k

ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కే నడుస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆదిపురుష్ తర్వాత రిలీజ్ కాబోయే ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. ఎక్కడో ఒక మూల చాలా భయం కూడా ఉంది. ఎందుకంటే ఏ సినిమా ( Prabhas movie Project K ) ఎప్పుడు హిట్టవుతుందో.. ఏ సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవుతుందో చెప్పలేం.. పైగా ప్రభాస్ సినిమా అనగానే భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత సంతృప్తి చెందలేకపోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాని ఆడియన్స్ ని మెప్పించాలి అంటే చాలా కష్టంగానే ఉంది. ఒకపక్క రాజమౌళి ప్రభాస్ కి ఎంత గొప్ప వరాన్ని ఇచ్చాడో.. అలాగే అంత గొప్ప టాస్క్ ని కూడా మిగిల్చి వెళ్లాడని అనుకుంటున్నారు.

See also  Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి ఇదే కారణమని.. గుట్టు రట్టు విప్పిన మంచు లక్ష్మి..

thammareddy-comments-on-prabhas-movie-project-k

అయితే ఇటీవల రెండు సార్లు ప్రాజెక్టు కే సెట్ కి వెళ్లి తమ్మారెడ్డి ఇలా చెప్పారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఆయన చెప్పారు. సరిగ్గా ప్రమోట్ చేస్తే ఈ సినిమా మొదటిరోజు 500 నుంచి 600 కోట్లు కచ్చితంగా రాబడుతుందని ఆయన అభిప్రాయాన్ని తెలియజేశారు. వైజయంతి మూవీస్ ప్రచారంపై ఈ రికార్డు ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. ఇక ఆయన చేసిన ఈ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. ఇంకా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టుకి ఎన్నో అంచనాలను అధిగమించింది అన్నారు. తమ్మ రెడ్డి చెప్పినట్టుగానే ఈ సినిమా గాని సూపర్ హిట్ అయితే.. ప్రభాస్ ఒక్క రోజులో 500 కోట్లు సంపాదించినట్టే సంపాదించి పెట్టినట్టే అని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.