Actor Vijay Varma: నటుడు విజయ వర్మ అంటే మనందరికీ తెలియకపోవచ్చు కానీ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రంలో విలన్ క్యారెక్టర్ లో నటించాడు. ఇదే కాకుండా మిర్జాపూర్ లో కూడా నటించాడు. కానీ తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టకపోవచ్చు. విజయ వర్మ అంటే ఎవరా అనే ఆలోచనలో ఉండి ఉంటారు. కానీ ఎప్పుడైతే తమన్నా బాయ్ ఫ్రెండ్ అని ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుందో అప్పటినుంచి అతను ఎవరు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పుడు ఓహో ఈ చిత్రాలలో నటించిన విజయవర్మనా అంటూ నలుగురికి తెలిసింది. ఇదే కాకుండా ఇన్ని చిత్రాలు నటించినప్పుడు రాని గుర్తింపు కేవలం తమన్నా బాయ్ ఫ్రెండ్ గా అని తెలిసినప్పటినుండే విజయ్ వర్మకి చాలా గుర్తింపు వచ్చింది. ఇక హైద్రాబాద్ లో పుట్టిన మన తెలుగు నటుడైనప్పటికీ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. ఇటీవలి కాలంలో తమన్నతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ చాలా ఫేమస్ గా మారిపోయాడు.
అయితే అసలు వీళ్ళిద్దరికీ ఎక్కడ కుదిరింది? వీళ్ళ ప్రేమ ఎక్కడ చిగురించింది? అని చాలామంది ఆరా తీస్తున్నారు. మరి వీళ్ళిద్దరూ లస్ట్ స్టోరీస్ టూ లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి బంధము ఏర్పడి అది ప్రేమగా మారి ఒకరినొకరు అర్థం చేసుకొని చివరికి పెళ్లికి కూడా రెడీ అయ్యారని ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఒక షాకింగ్ విషయాన్ని విజయ వర్మ బయటపెట్టాడు. ఆయన తాజాగా మాట్లాడుతూ ఆ సినిమాలో ఉన్న నా నటన చూసిన ఆడోళ్ళు చంపాలని చూసారా అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టారు.
అసలు విషయం ఏంటనేది మనం చూసినట్లయితే.. ఆలియా భట్ విజయ్ వర్మ (Actor Vijay Varma) కాంబినేషన్లో డార్లింగ్స్ అనే సినిమా విడుదలైంది. ఇక ఈ చిత్రంలో అలియా భట్ విజయవర్మ ఇద్దరూ భార్య భర్తలు గా నటించారు. అయితే ఇందులో విజయ వర్మ భార్య ఆలియా భట్ ను తెగ టార్చర్ చేసే పాత్రలో మనకు కనిపిస్తాడు. ఈ చిత్రం చూసిన చాలా మంది ఆడవాళ్లు ఇలాంటి భర్త ఉండడం కంటే చావడమే నయమని అన్నారట అనుకుంటున్నారంట.
ఇదే కాక ఈ చిత్రం చూసిన చాలా మంది ఆడవాళ్లు మీలాంటి వాళ్ళని కచ్చితంగా చంపేయాలంటూ నా ముందే ఆ విషయాన్ని వెల్లడించారు. ఇక వాళ్లు మాట్లాడిన ఆ మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే.. చాలా మంది భార్యలు ఎంత టార్చర్ చేసినా కూడా ఆనందంగా భరిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెట్టింట ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. చాలా మందికి ఈ విషయం అర్థం కాక తలలు వాడుకుంటున్నారు. సినిమా వార్తలు ప్రతి సినిమాకు సంబంధించిన విషయమే ఉంటుంది అని తెలియక వాళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.