Tamanna Casting Couch: తమన్నా 2005వ సంవత్సరంలో హిందీ చిత్ర పరిశ్రమతో అడుగుపెట్టిన తర్వాత తెలుగులో శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2006 సంవత్సరంలో కేడి అనే సినిమాతో కోలీవుడ్లో అడుగు పెట్టింది ఇలా కెరియర్ స్టార్టింగ్ లో మూడు సినిమాలు బోల్తా కొట్టడంతో, ఆ తర్వాత శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రంతో మంచి హిట్ తమన్నాకు ఇచ్చాడు. అలా అప్పటి నుంచి తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన తమన్న ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి తాను కూడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
అలా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తమన్నా ఆ తర్వాత పలు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత తమన్నాకు అవకాశాలు రావడం తగ్గాయి. అయితే తమన్నా ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ గురించి తొలిసారి నోరు విప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చే ఏ హీరోయిన్ కైనా బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే ఎదురయ్యే సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీ లోకి రావాలంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇయ్యాల్సి ఉంటుంది.
ఒకప్పుడు దీని గురించి మాట్లాడాలంటే భయపడేవారు. మీటు ఉద్యమం తర్వాత ప్రతి ఒక్కరు దీని గురించి నోరు విపుతున్నారు. అలా వాళ్ల జీవితంలో అనుభవాలను తెలుపుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన తమన్నా క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తమన్నా దీని పై స్పందించడం పెద్ద దుమారమే లేపుతుంది. తాజాగా.. తమన్నా మాట్లుతూ బాలీవుడ్ లో అవకాశం కోసం వెలితే అప్పట్లో ఓ నిర్మాత తనను గెస్ట్ హౌస్ కి రావాలని తన మేనేజర్ తో చెప్పించాడట.
మీరు ఆయన్ను తన గెస్టౌస్ లో కలిసి సంతృప్తి పర్చాలని ఆయనతో ఒక్కసారి గెస్టౌస్ లోకి వెళితే అన్ని ఆయనే చూసుకుంటారని చెప్పాడట. దీంతో తమన్నాకు అతడు ఏం చెప్తున్నాడో ఆ ఉద్దేశ్యం అర్ధమయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయిందట. ఆ చేదు అనుభవాలను ఓ ఇంటర్వూలో మీడియాతో పంచుకున్నారు. మొత్తానికి తమన్నాకు కూడా ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ (Tamanna Casting Couch) అనుభవాలు ఎదురై నోరు విప్పటంతో ప్రస్తుతం ఈ న్యూస్ హట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.