Sunishith : ఈరోజుల్లో సోషల్ మీడియా ఉండడం అనేది ఒకరకంగా అదృష్టమైతే, ఇంకొక రకంగా దురదృష్టం కూడా అనిపిస్తుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ దాన్ని వాడుకుని అభివృద్ధిని, అవగాహనని, సంస్కారాన్ని పెంచుకోవాలి కానీ, దాని ( Sunishith gets trashed by fans ) ద్వారా ఇంకా కొందరు దిగుతూ ఏవేవో చేయడం అనేది నిజంగా బాధాకరం. సునిశిత్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు. అతనికి చాలామంది హీరోలు హీరోయిన్స్ తో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పుకుంటూ.. ఫలానా హీరో నా వల్లే హీరో అయ్యాడని.. ఫలానా హీరోయిన్ తో నాకు అఫైర్ ఉందని లేదా ఇంకొక హీరో తనను ఆ సినిమా నుంచి తప్పించి లాక్కున్నాడని ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ.. సెలబ్రిటీస్ మీద కామెంట్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాడు.
ఎవరికైనా ఎప్పుడైనా ఎలాంటి హవా అయినా కొంతకాలం సాగుతుంది. ఏది మితిమీరినా చివరికి అది చెడుకే దారి తీస్తుంది. అలాగే సునిశిత్ విషయంలో కూడా జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన హీరో. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మెగా అభిమానులకు ఎలాంటి కొరత ( Sunishith gets trashed by fans ) లేదన్న విషయం మనకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ ఎదుగుతున్న తీరు, పెంచుకుంటున్న తన బలాన్ని, గౌరవాన్ని చూసి మెగా అభిమానులు ఎంతగా పొంగిపోతున్నారో చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి రాంచరణ్ గురించి సునిశక్తి అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వాళ్ళ హీరో భార్య అంటే వాళ్ల వదినతో సమానం అని ఆరాధించే అభిమానులు ఉపాసనను అంతలేసి మాటలు అంటే తట్టుకోలేక సునిశిత్ పై దాడి చేయడం జరిగింది. ఉపాసనని పట్టుకొని అంతంత మాటలు అన్నందుకు సునిశిత్ ని మెగా అభిమానులు చితకొట్టారు. రామ్ చరణ్ ఉపాసనల మీద సునీత చేసిన కామెంట్లు వీడియో ఎంత వైరల్ అయిందో.. అభిమానుల చితగ్గొట్టిన వీడియో ఇంకా గొప్పగా వైరల్ అయింది. అభిమానులు ( Sunishith gets trashed by fans ) గట్టిగా ఇచ్చుకుంటుంటే ఉపవాసనను కామెంట్ చేసేటప్పుడు ఎటువంటి ఆలోచించకుండా చేసిన సునిశిత్.. తర్వాత చివరికి తప్పైపోయిందని క్షమించమని, ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయనని చెప్పాడు. ఈ ఆలోచన ముందుగానే ఉండుంటే అనవసరంగా సునిశిత్ కి ఇంత బాధ ఉండకపోను, అతని ఇంటర్వ్యూ తీసుకున్న చానల్స్ మీద కూడా అనవసరమైన ఒత్తిడి లేకుండా ఉండునని నెటిజనులు వాపోతున్నారు.
ఈ రోజుల్లో సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి ఏవేవో మాట్లాడితే.. నలుగురిలో పాపులారిటీ వస్తాదని, దానితో వాళ్ల సక్సెస్ దారి వెతుక్కోవచ్చని చాలామంది అనుకుంటున్నారు. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఆ మెట్టు వరకు వెళ్లడానికి వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎంతో కష్టపడి అక్కడి వరకు వెళ్తారు. వాళ్ల గురించి మనం ఒక వార్త రాసుకోనో., ఒక ప్రచారం చేసుకోనో సంపాదించుకోవడంలో తప్పులేదు కానీ, దానిలో కూడా కొంత ఎథిక్ అనేది ఉండాలి. కాబట్టి దాన్ని మనసులో ఉంచుకొని సరైన మార్గంలో సవ్యమైన దారిలో వాళ్ళని ఫాలో అవుతూ.. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మంచి సంపాదించుకోవాలి తప్ప ఇలా అనవసరమైన మాటలు, అనవసరమైన ప్రచారాలు చేసి దాని మీద పునాదులు వేసుకోవాలనుకుంటే చివరికి ఎలాంటి కష్టాలే వస్తాయని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు.