Prabhas – Suma : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఐన ప్రభాస్ సక్సెస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఒక్కసారిగా బాహుబలి సినిమా లాంటి వండర్ సక్సెస్ ని చూసి.. ఆ తర్వాత అతని ప్రతి సినిమాని అంతే భారీ అంచనాలతో ఎదురుచూడడం మొదలుపెట్టారు సినీ అభిమానులు. అక్కడే ( Suma and Prabhas ) ప్రభాస్ కి గట్టిగా దెబ్బ కొడుతుంది.. బాహుబలి అంత సూపర్ హిట్గా మిగిలిన సినిమాలు లేకపోవడంతో.. బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. ఇక ఇటీవల రిలీజైన ఆదిపురుష్ సినిమా మీద భారీ అంచనాలందరూ పెట్టుకోగా.. అది చాలా నెగిటివ్ కామెంట్స్ కి లోనైంది. అయినప్పటికీ కలెక్షన్స్ అయితే బాగానే వస్తున్నాయని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
అలాగే ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై, ఇంకా సినిమా ఈవెంట్స్ లో యాంకర్ గా చేస్తున్న సుమ గురించి మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్లకు సైతం లేని క్రేజ్ సుమకి ఇంకా ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. ఏ సినిమా ( Suma and Prabhas ) ఈవెంట్ అయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. దర్శకుడు, నిర్మాతలు అందరూ కూడా ఆ సినిమాకి యాంకర్ గా సుమ ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఆమెకి ఏ టైంలో డేట్స్ ఖాళీ ఉన్నాయో చూసుకొని.. ఆ టైంకి ఈవెంట్ ని ప్లాన్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నేళ్లు అవుతున్నా ఆమె డిమాండ్, ఆమె మాటతీరులో గాని మార్పు రాని గొప్ప యాంకర్ సుమ. అలాంటి సుమ.. ప్రభాస్ సినిమాలో నటించిన విషయం ఎంతమంది గుర్తుంటుందో తెలియదు.
సుమ.. ప్రభాస్ సినిమాలో అక్కగా నటించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే వర్షం. ప్రభాస్ హీరోగా.. త్రిష హీరోయిన్గా .. గోపీచంద్ విలన్ గా వచ్చిన సినిమా వర్షం. ఆ రోజుల్లో ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ( Suma and Prabhas ) మర్చిపోలేని విజయం అంటే వర్షం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇప్పటికీ రీ రిలీజ్ అయి కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సుమ ప్రభాస్ కి అక్కగా నటించింది. ఈ విషయాన్ని సుమ ఇటీవల ఒక ఈవెంట్లో అందరికీ గుర్తు చేసింది. ప్రభాస్కి అంత సక్సెస్ ఇచ్చిన సినిమాలో సుమ కూడా ఒక భాగం అవడం నిజంగా ఎంతో బాగుందని.. కానీ అది ఎవరికి అసలు గుర్తొన్నదే సుమ చెప్పేవరకు లేదని.. ఎంతో మంది నెటిజనులు అనుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమ హీరోయిన్ అవుదామని వచ్చింది ఒక సినిమాలో హీరోయిన్గా నటించగా.. ఆమె ఆ సినిమాలో ఎటువంటి సక్సెస్ ని సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె సినిమాలను వదిలేసి.. యాంకర్ గా తన లైఫ్ని మొదలుపెట్టింది. రాజీవ్ కనకాలకి భార్యగా.. ఆయన పిల్లలకు తల్లిగా.. మరోపక్క తన కెరీర్ లో కూడా ఎంతో అద్భుతంగా చూసుకుంటూ వచ్చింది. ఇంటిని చక్కదిద్దుకుంటూ తన కెరీర్ ని నిలబెట్టుకుంటూ ఎందరో ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలిచింది. అటువంటి సుమ ఇటీవల ఒక ఈవెంట్లో నేను ప్రభాస్ కి అక్కగా నటించాను అని చెప్పే వరకు ఎవ్వరు కూడా అది ఊహించలేదు. అక్కడ ఒక్కసారిగా సుమా అభిమానులు ప్రభాస్ అభిమానులు చప్పట్లు కొట్టారు