Home Cinema Director Rajamoulis: రాజమౌళి మంచి అవకాశం ఇస్తే చెయ్యనని ఆ తర్వాత బాధ పడ్డ స్టార్స్...

Director Rajamoulis: రాజమౌళి మంచి అవకాశం ఇస్తే చెయ్యనని ఆ తర్వాత బాధ పడ్డ స్టార్స్ ఇగో వీళ్ళే..

Director Rajamoulis: తన సినీ కెరియర్ లో అపజయమంటూ ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వన్ అండ్ ఓన్లీ దర్శక ధీరుడు గా పేరు తెచ్చుకున్న రాజమౌళి మాత్రమే అని చెప్పాలి. కింది నుండి పై స్థాయి వరకు ఎదిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆయన మాత్రమే ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో విషయాలు ఉంటాయి. దర్శకధీరుడు గా పేరుగాంచిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు సినీ ప్రియులు.. అందరూ డైరెక్టర్లు చిత్రాలను చేస్తే ఆయన చిత్రాలను చెక్కుతాడు అందుకే ఆయనకు జక్కన్న అని ముద్దుగా పేరు పెట్టి పిలుస్తుంటారు. సుదీర్ఘమైన రెండున్నర దశాబ్దాల సినిమా జీవితంలో అపజయమంటూ ఎరుగని ఏకైక దర్శకుడుగా దూసుకుపోతున్నాడు రాజమౌళి.

stars-who-rejected-director-rajamoulis-offer-and-later-regretted-for-doing-so

అలాంటి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గాను ఆస్కార్ అవార్డు కూడా తెచ్చి పెట్టాడు. దాంతో రాజమౌళికి సాధ్యం కానిదేదీ లేదని ఆ క్షణం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. తన అద్భుతమైన మేకింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ ఫిలిం డైరెక్టర్స్ ను కూడా అబ్బురపరిచి రాజమౌళితో కలిసి పనిచేసేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.. అయితే ఇంత గొప్ప డైరెక్టర్ రాజమౌళి పిలిచి మరి పిల్లని ఇస్తా అన్నా కూడా నేను చేయను అని రాజమౌళి అవకాశాన్ని సైతం తిరస్కరించి పొమ్మన్నారట. కానీ ఆ తర్వాత ఆ స్టార్ కూడా తెగ బాధ పడిపోయారట.. మరి ఆ స్టార్స్ ఎవరు.? అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి. ఇక రాజమౌళి నిర్మించినటువంటి చిత్రాల్లో అతి ముఖ్యమైనది దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ళ సునామీ రాబట్టిన చిత్రం బాహుబలి.

See also  Allu Arjun: చిరంజీవిని అస్సలు అనకూడని మాట అన్న అల్లు అర్జున్.. చరణ్ అయితే పూర్తిగా దూరం పెట్టేశాడు అంట.

stars-who-rejected-director-rajamoulis-offer-and-later-regretted-for-doing-so

ఇక ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర అంటే ఎవరు అంత త్వరగా మర్చిపోలేని పాత్ర. ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి దివంగత తార శ్రీదేవిని సంప్రదించగా ఆమె ఏవేవో కండిషన్స్ పెట్టిందట.. ఆమె పెట్టిన కండిషన్స్ రాజమౌళి తిరస్కరించడంతో బాహుబలికి శ్రీదేవి నో చెప్పిందట. ఇక ఇదే కాకుండా ఇదే చిత్రం బాహుబలి లో బల్లాల దేవుని పాత్ర కోసం మొదట బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయెను అనుకున్నాడట. కానీ ఆయన కూడా ఏవేవో కారణాల చేత రిజెక్ట్ చేయడంతో రానా ను ఎంపిక చేశారట.. ఇక రాజమౌళి నిర్మించినటువంటి మరొక చిత్రం రాజమౌళి రవితేజ కాంబినేషన్లో వచ్చిన విక్రమార్కుడు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ చిత్రాన్ని మొదట రాజమౌళి చేద్దామనుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అట..

See also  Trivikram: రాత్రి అయినా వదలకుండా అలాంటి పనులు చేస్తున్న త్రివిక్రమ్.. ఈ వయసులో అవసరమా గురువుగారు..?

stars-who-rejected-director-rajamoulis-offer-and-later-regretted-for-doing-so

కానీ కథ విన్నాక పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీగా లేవని సింపుల్గా తిరస్కరించాడట. ఇక ఇదే కాకుండా గత సంవత్సరం వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కూడా ఆలియా భట్ పోషించిన సీత పాత్రకు మొదట బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను అడిగారట.. ఆమె కూడా ఏవేవో కారణాల చేత నేను చేయనని చెప్పిందట. ఇక మగధీర చిత్రంలో సలోని చేసిన ఓ స్పెషల్ సాంగ్ ను మొదట రాజమౌళి అర్చన చేత చేయించాలని అనుకున్నాడట కానీ అందుకు ఆమె నో అని చెప్పిందట.. ఇలా రాజమౌళి (Director Rajamoulis) పిలిచి మరి అవకాశాలు కల్పించిన సరే ఏవేవో కారణాల చేత రిజెక్ట్ చేసి నవారు ఆ తర్వాత అనవసరంగా గోల్డెన్ లాంటి ఆఫర్లు వదులుకున్నాను అని ఎంతగానో బాధపడిపోయారట..