Nayanthara : నయనతార టాలీవుడ్ లో బాలీవుడ్ లో అనేక సినిమాలు నటించి ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. అందుకే ఈమెని లేడీ సూపర్ స్టార్ అని అంటారు. ఏ పాత్రనైనా దానికి అనుగుణంగా తన నటనను మలుచుకొని.. ఎంతో అద్భుతంగా చేస్తుంది. ఇటీవల నయనతార మరియు ఆమె భర్త విగ్నేష్ శివన్ తండ్రి ( Nayanthara property details ) అన్నదమ్ములు ఆస్తి తగాదాల కోసం.. కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే నయనతార స్టార్ హీరోల కంటే మించిపోయి డబ్బు సంపాదించుతుంది. ఆమె గ్యారేజ్ లో ఉండే కార్లు చూస్తే కళ్ళు చెదురుతాయి. అంత లగ్జరీగా, గొప్పగా ఆమె లివింగ్ స్టైల్ ఉంటుందని అంటున్నారు.
నయనతార గ్యారేజీలో బీఎండబ్యూ , మెర్సిడెస్ , టయోటా ఇన్నోవా క్రిస్టా , బీఎండబ్ల్యూ 7సిరీస్, ఫోర్డ్ వంటి ఖరీదైన కార్లు ఆమె గ్యారేజీలో ఆమె కోసం రెడీగా ఉంటాయి. అంతేకాకుండా షూటింగ్ కి వెళ్లడానికి సొంత ప్రైవేట్ జెట్ విమానం కూడా ఉందంట. ఇక ఆస్తులు విషయానికొస్తే.. నయనతారకు చెన్నైలో 100 కోట్ల విలువచేసే బిల్డింగ్ ( Nayanthara property details ) ఉందంట. చెన్నైలోనే కాకుండా కేరళ, ముంబైలో కూడా కొన్ని కోట్ల విలువ చేసే బంగ్లాలో నయనతారకు ఉన్నాయంట. ఇవి మాత్రమే కాకుండా ఆమె టాలీవుడ్ లో నటించేటప్పుడు హైదరాబాదులో 15 కోట్ల విలువచేసే ఇల్లు కొనుక్కుందంట.
ఇల్లు, కార్లు, బంగారం, స్థలాలు ఇవి మాత్రమే కాకుండా నయనతార ఎప్పటినుంచో మూసేసి ఉన్న ఒక థియేటర్ కూడా కొనుగోలు చేసింది అట. ఇలా నయనతారకి దాదాపుగా 170 కోట్ల విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయని అంటున్నారు. ఈమె ప్రతి సినిమాకి రెమ్యునిరేషన్ పది కోట్లు తీసుకుంటుంది అని అంటున్నారు. ఈమె ( Nayanthara property details ) ఆస్తులు వివరాలు ఈమె రెమ్యూనరేషన్ చూస్తుంటే పెద్ద స్టార్ హీరోస్ కి కూడా ఇంత ఉండదేమో అనిపిస్తుంది. చూడటానికి చాలా సింపుల్ గా కనిపించే నయనతార వెనుక ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఎవరు కూడా ఊహించరు. ఎప్పటి నుంచి ఆమె నటిస్తూ.. అప్పుడు వచ్చిన అమౌంట్ ని అలా జాగ్రత్త చేసుకుంటూ.. దానితో ఆస్తులు కొనడం మొదలుపెడితే.. ఇప్పుడు అంతగా డెవలప్ అయ్యాయి.
నయనతార కేవలం సినిమాలో నటించడమే కాకుండా.. యాడ్స్ కూడా ఆమె నటిస్తుంది. యాడ్స్ పై నటీనటులకు చాలా మంచి ఆదాయం వస్తుంది. ఎందుకంటే అతి తక్కువ సమయం నటించి.. ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకుంటారు. అలాగే నయనతార కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తుంది. ఈమె సినిమాలో నటన, యాడ్స్ లో నటించడం, బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉండటం మాత్రమే కాకుండా ఇంకా డబ్బును సంపాదించుకోవడం కోసం బిజినెస్ లు కూడా రన్ చేస్తుంది. ఇలా ఆమె ఆస్తిని, అంతస్తులన్నీ పెంచుకుని, ఆమెకున్న క్రేజ్ ని కూడా పెంచుకుని, చక్కగా ఆమె జీవితాన్ని హాయిగా భర్తతో కలిసి బ్రతుకుతుంది.