Home Cinema Pawan Kalyan: చివరి క్షణంలో షాకిచ్చిన క్రేజీ హీరోయిన్..!! పవన్ సినిమాలో శ్రీలీల ఉంటే నేను...

Pawan Kalyan: చివరి క్షణంలో షాకిచ్చిన క్రేజీ హీరోయిన్..!! పవన్ సినిమాలో శ్రీలీల ఉంటే నేను నటించను..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం అంటే ప్రతి హీరోయిన్ గొప్పగా ఫీల్ అవుతుంది. ఆ ఛాన్స్ దొరికితే చాలని చాలామంది అనుకుంటారు..కానీ ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్ ఇగో కారణం చేత పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం కోల్పోయింది. ఎందుకంటే ఓ స్టార్ హీరో సరసన ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఉన్నారంటే వారి మధ్య భారీ స్థాయిలో ఫీలింగ్ తప్పక ఉంటుంది. ఈ ఇగో ఫీలింగ్ ఇప్పటినుంచి కాదు.. కొన్ని దశాబ్దాల నుండే సినీ ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాము. అప్పట్లో రాఘవేందర్రావు దర్శకత్వం వహించిన దేవత అనే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. (Star heroine keeps a condition in last minute to act with pawan Kalyan)

See also  JR NTR: జూనియర్ ఎన్టీఆర్ కు అసలు తన పేరు పెట్టింది ఎవరో తెలుసా.? తన తండ్రి మాత్రం కాదు.

star-heroine-keeps-a-condition-in-last-minute-to-act-with-pawan-kalyan

వాళ్ళు ఒకరు జయప్రద, మరొకరు శ్రీదేవి. వీరిద్దరిని కంట్రోల్ చేసేందుకు రాఘవేంద్రరావు గారికి ముప్పు తిప్పల మూడు చెరువుల నీళ్లు తాగినంత పని అయిందట అలా ఉంటది మరి ఇద్దరి హీరోయిన్లతో పెట్టుకుంటే..ఇదే తరహాలో ఈ సినిమాలో శ్రీలీల ఉందన్న కారణంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోని బంపర్ ఆఫర్ ను వదులుకుంది ఆ క్రేజీ హీరోయిన్. తను ఎవరో కాదు (Star heroine keeps a condition in last minute to act with pawan Kalyan) మలయాళ నటి మాళవిక మోహనన్. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్..ఇందులో శ్రీలీలను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కానీ ఈ చిత్రానికి కావాల్సింది ఇద్దరి హీరోయిన్లు.

See also  Sam - Chaithu: ఆ స్టార్ హీరో వల్లనే సమంత చైతులు వివాహం చేసుకుని విడాకులు తీసుకుని విడిపోయారా.? బయటపడ్డ సంచలనమైన నిజం.

star-heroine-keeps-a-condition-in-last-minute-to-act-with-pawan-kalyan

ప్రస్తుతం వరుస హిట్స్ తో జోరు మీదున్న క్రేజీ పాప (Crazy Heroine) శ్రీలీలను హీరోయిన్ గా తీసుకోగా, మరొక హీరోయిన్ మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ను తీసుకోవాలని శంకర్ అనుకున్నాడు. అయితే ఈ సినిమాలో శ్రీలీల ఉందని తెలియడంతో.. అదే కాకుండా పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ.. నేను ఈ సినిమాలో చేయనని చెప్పేసిందట మాళవిక. నేను మొదటి హీరోయిన్ గా అయితేనే చేస్తానని ఇండైరెక్టుగా హింట్ ఇచ్చిందట. అయితే మాళవిక మోహనన్ లాంటి హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశమంటే అది మామూలు విషయం కాదు.

See also  Janhvi Kapoor : జాన్వీ కపూర్ మెగా ఫ్యామిలీ మీద కన్నేయడమే కాకుండా ఎంత పని చేసిందంటే..

star-heroine-keeps-a-condition-in-last-minute-to-act-with-pawan-kalyan

ఎగిరి గంతేసి.. సరే అని చెప్పాలి. కానీ.! చేయనని చెప్పిందట. వరుస హిట్లతో ఊపు మీదున్న శ్రీలీల ఉంటే తన పాత్రకు పెద్దగా గుర్తింపు ఉండదని అనుకుందో ఏమో.. అదే విధంగా పవన్ కళ్యాణ్ పక్కన మెయిన్ హీరోయిన్ గా మాత్రమే ఉండాలని అనుకుందో ఏమో గాని ఏ మాత్రం మొహమాటం లేకుండా చేయనని చెప్పిందట. దీంతో హరీష్ శంకర్ మరొక హీరోయిన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతో డైరెక్టర్ పూజ హెగ్డే కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది.