Sridevi and Nayanthara both have same problem: సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మూడు తరాలతో అందాల తారగా, అతిలోక సుందరికగా అలరించిన శ్రీదేవి మనల్ని వదిలి వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ, ఎప్పటికీ మరువలేని తార ఆమె. శ్రీదేవి హీరోయిన్ గా నటించే ప్రతీ సినిమాలో ఆమెది ఎంత పాత్ర ఉంది, ఆ సినిమాలో ఆమె ప్రాముఖ్యత ఎంత అనేది ఎవ్వరూ ఆలోచించరు. ఆ సినిమాలో హీరోయిన్ శ్రీదేవి అంటే, చాలు ఆనందమే. అలాగే లేడీ సూపర్ స్టార్ గా వెలుగుతున్న నయనతార కూడా ఒక వెలుగు వెలుగుతుంది. ఎంతకాలం అయినా అదే మెరుపుతో హీరోలకి సరి సాటిగా పయనిస్తోంది. సౌత్ సినీ ఇండస్ట్రీ లో నయనతార అత్యధిక పారితోషకము తీసుకుంటుంది. శ్రీదేవి, నయనతార వాళ్ళు సృష్టించుకున్న ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు.
అయితే నయనతార కొన్ని రూల్స్ ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాది. ఆమె ఎన్నుకునే కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాది. కానీ ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటిస్తాది కనుకే ఆమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. అలాగే నయనతార ( Sridevi and Nayanthara both have same problem ) రెమ్యూనిరేషన్ విషయంలో చాలా గట్టిగా ఉంటాదంట. అందరికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే ఈమె, అందులో ఒక్క రూపాయి తగ్గినా ఒప్పుకోదంట. పైగా తన స్క్రీన్ ని ఇంకొక హీరోయిన్ పంచుకుంటే కూడా ఒప్పుకోదంట. ఇటీవల మమతా మోహన్ దాస్ చేసిన వ్యాఖ్యలతో నయనతారపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ లు ఎక్కువ అయ్యాయి. అయినా కూడా నయనతార ఇలాంటివి ఏమి పట్టించుకునే మనిషి కాదు. తన పని తనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్లిపోయే మనిషి.
అసలు నయనతార తన సినిమాలో ఇంకొక హీరోయిన్ ని ఎందుకు ఉండనివ్వదంటే, ముఖ్యంగా తనతో పాటు స్క్రీన్ పంచనివ్వదు.. దానికి కారణం ఆ సినిమా, ఆ సీన్ ఏది హిట్ అయినా మొత్తం క్రెడిట్ నయనతారకే కావాలంట. ఈ విషయమే మమతాదాస్ ఇండైరెక్ట్ గా చెబుతూ బాధపడింది. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయితే మాత్రం అంత స్వార్ధమా అని అంటున్నారు సినీ అభిమానులు. సినిమాల గురించే కాకూండా పర్సనల్ లైఫ్ లో కూడా నయనతార అనేక సమస్యలను ఎదుర్కొంటూ.. వివాదకరమైన హీరోయిన్ గా పేరు పొందింది. అప్పట్లో శ్రీదేవి కి కూడా ఇలాంటి పేరే వచ్చింది. శ్రీదేవి కూడా చాలా పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమె జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది.
అలాగే నయనతార లానే శ్రీదేవి రేంజ్ పెరిగే కొద్దీ ఆమె సినిమాల ఎంపిక విధానం సినిమా తీసేవాళ్లకి కొంత కష్టతరమే. ఎందుకంటే హీరో పాత్రతో వీళ్ళ పాత్ర పోటీ పడేలా ఉండాలి. లేకపోతే ఈ ఇద్దరు హీరోయిన్స్ ని పెప్పించి ఒప్పించడం చాలా కష్టం. అలాంటి నైజంతోనే శ్రీదేవి చిరంజీవితో కూడా గొడవ పడిందట. ఇప్పుడు నయనతార కూడా అలానే తయారయ్యింది. వీళ్ళిద్దరిది డామినేటింగ్ మెంటాలిటీ. అందుకే శ్రీదేవి నయనతార ఇద్దరికీ ఒకే లాంటి జబ్బు ( డామినేటింగ్ మైండ్ సెట్ ) ఉందని, వీళ్లకు సర్దుకుపోయే గుణం లేదని నెటిజనులు వాపోతున్నారు.