
Sri Reddy : శ్రీ రెడ్డి అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. ఈవిడకి ఎప్పుడు ఎవరిమీద కోపం వస్తుందో.. ఎవరి మీద ప్రేమ వస్తుందో.. చెప్పడం ఎవరినైనా కామెంట్ చేయాలంటే.. వెనక ముందు ఆలోచించకుండా వెంటనే వాళ్ళ లూప్ హోల్స్ ( Sri Reddy comments on Rohit Sharma ) ఏమైనా ఉంటే.. పట్టుకొని చాలా గట్టిగా ఫైర్ అవ్వగలిగే లేడీ శ్రీ రెడ్డి. సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పి.. ఎందరినో ఆ సమస్యలోకి లాగి.. వాళ్ళు ఏమైనా చేశారో బయటికి చెప్పి సాక్షాలతో సహా చూపించిన శ్రీరెడ్డి గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సినిమా ఆఫర్లు ఇస్తామని చెప్పి తనని వాడుకున్న తర్వాత కూడా.. సినిమా ఆఫర్లు ఇవ్వలేదని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు వాళ్లకి ఆఫర్స్ ఇవ్వడం లేదని ఈమె పెద్దగానే గొడవ చేసింది.
ఆ క్రమంలో ఫిలిం చాంబర్ ఎదురుగా అర్ధ నగ్నంగా కూర్చొని పోరాడింది. ఏదేమైనా ఇవన్నీ ఇలా ఉంచితే.. ఇటీవల దగ్గుబాటి అభిరామ్ సినిమా అహింస రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. దాని గురించి కూడా శ్రీరెడ్డి ఒక రివ్యూ రాసింది. ఇక ఆ రివ్యూ లో అయితే భయంకరమైన మాటలు, భయంకరమైన ఇవి ఉన్నాయి. అప్పట్లో ( Sri Reddy comments on Rohit Sharma ) అభిరామ్ మీద ఆవిడ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ గా ఉన్న ఫొటోస్, వాట్స్అప్ చాటింగ్ లు అన్నీ కూడా.. స్క్రీన్ షాట్స్ తో సహా సోషల్ మీడియాలో పెట్టి.. అప్పట్లో తెగ రచ్చ చేసింది. ఇప్పుడు ఆమె యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ.. అందులో ఎప్పుడు సోషల్ మీడియాకి అందుబాటులో ఉంటూ ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఆమె ఈ సినిమా వాళ్ళని మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల వైపు కూడా కన్నేస్తూ ఉంటుంది. వైసీపీకి మద్దతు పలుకుతూ.. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ని కూడా ఈమె చాలా గట్టిగా ఇచ్చింది. వీళ్ళు వాళ్ళు అని లేదు.. సినిమా వాళ్లు రాజకీయ వాళ్లు అందరూ అయిపోయారు అనుకుంటే ( Sri Reddy comments on Rohit Sharma ) ఇప్పుడు క్రికెట్ టీం మీద పడింది. క్రికెట్ టీం వాళ్లలో ఒకరు చేసిన తప్పుని ఎత్తిచూపుతూ.. గట్టిగా ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చింది. ఏది ఏమైనా అన్ని రంగాల్లో ఈవిడకే ఎంతోకొంత నాలెడ్జ్ ఉండడం.. దానిమీద అవతలి వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపించడం.. వాళ్ళ మీద ఫైర్ అవడం వీటితో శ్రీరెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు పాపులర్ అవుతూనే వస్తుంది. కష్టపడి సినిమా హీరోయిన్ అయినా కూడా కొంతకాలానికి మర్చిపోదురేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు ఆవిడ ఫ్రెష్ గా.. ఏదో ఒక కామెంట్ చేసే వైరల్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు శ్రీరెడ్డి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ.. తనదైన శైలిలో ట్విట్టర్లో విమర్శలు చేసింది. ఎందుకంటే లండన్ లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మొదటి రోజు భారత్ పై ఆస్ట్రేలియా పై చేయి సాధించగా.. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంపిక చేసుకోవడంపై ఆమె విమర్శలు చేస్తుంది. ఓవల్ ఉన్న పరిస్థితులను బట్టి టాస్ గెలిచినప్పుడు ఎవరైనా సరే బ్యాటింగ్ ఎంచుకుంటారు గాని.. విరుద్ధంగా రోహిత్ బౌలింగ్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని విమర్శించింది. రోహిత్ ఇదేమన్నా నువ్వు ఐపీఎల్ అనుకుంటున్నావా.. నీ కెప్టెన్సీ చూసి కోహ్లీ కూడా నవ్వుకుంటున్నాడు.. ఇదేంట్రా బాబు అని ప్లేయర్స్ నే కోహ్లీ బాగా ఇన్స్పైర్ చేస్తాడు ప్రపంచంలో అతడే ఉత్తమ టెస్ట్ కి కెప్టెన్ నువ్వేమో ఇలా చెత్తలా కెప్టెన్సీ చేస్తున్నావు అంటూ విరుచుకు పడింది. ఇలా క్రికెట్ కి సంబంధించిన వాళ్ళను కూడా శ్రీరెడ్డి వదలకుండా గట్టిగా ఫైర్ అవడం అనేది ఆశ్చర్యంగానే ఉంది.