Home Cinema Sree Mukhi: శ్రీ ముఖి సినిమాల్లో హీరోయిన్ గా నటించక పోవడానికి కారణం రష్మీ నేనా.??

Sree Mukhi: శ్రీ ముఖి సినిమాల్లో హీరోయిన్ గా నటించక పోవడానికి కారణం రష్మీ నేనా.??

Sree Mukhi: రష్మి గౌతమ్ జబర్దస్త్ షో తో ఎలా స్టార్ యాంకర్ గా మారిపోయిందో శ్రీముఖి కూడా పటాస్ షో తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా మారిపోయింది. జబర్దస్త్ కి పోటీగా పటాస్ షో కూడా ఎంతలా వైరల్ అయిందో ప్రత్యేకించి తెలుపనవసరం లేదు. అంతేకాక పటాస్ షో ద్వారా ఎందరో కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయమయ్యారు. ఇలాంటి పటాస్ షో ద్వారా ఫేమస్ అయిన శ్రీముఖి ఈ షో లో చేయడానికి ముందు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు పొందలేరు. దాంతో పటాస్ షోలో యాంకర్ గా రాణిస్తూ ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్ లలో శ్రీముఖి కూడా ఒకరుగా పేరు సంపాదించుకుంది.

See also  Telugu Star Heroines: అలా చేసే ఈ హీరోయిన్లు అందరూ స్టార్ హీరోయిన్లు గా ఎదిగారా.?

sree-mukhi-stops-acting-in-films-as-a-result-of-rashmi

ఇక ఆ మధ్యకాలంలో బిగ్ బాస్ కి వెళ్లిన శ్రీముఖి ఆ తర్వాత మరింత ఫేమస్ అయింది అంతే కాకుండా కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే మనం మన టాపిక్ విషయంలోకి అడుగు పెట్టినట్లయితే.. శ్రీముఖి (Sree Mukhi) సినిమాల్లో హీరోయిన్ గా నటించక పోవడానికి కారణం రష్మి నేనా.? రష్మీ వల్ల శ్రీముఖి సినిమాలో ఎందుకు నటించకూడదని భావిస్తుందని నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. అయితే దీనంతటికీ అసలైన కారణం రష్మి తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

See also  Varun Tej : వరుణ్ తేజ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా?

sree-mukhi-stops-acting-in-films-as-a-result-of-rashmi

ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం రావడంతో హీరోయిన్ గా కూడా నటించింది. కానీ కథలు ఎంపిక చేసుకాకుండా తాను సినిమాలను ఓకే చేసింది. ఆమె నటించిన సినిమాల్లో కేవలం గుంటూరు టాకీస్ మాత్రమే హిట్ అయింది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ గానే మిగిలాయి. దీంతో ప్రస్తుతం రష్మికి ఏ ఒక్క దర్శక, నిర్మాతలు కూడా హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం లేదు. దాంతో చేసేది ఏం లేక రష్మి మళ్ళీ బుల్లి తెరకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే రష్మి సినీ కెరియర్ దృష్టిలో పెట్టుకునే శ్రీముఖి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ కథ సరిగ్గా లేని సినిమాల్లో నటించకూడదనే బలమైన నిర్ణయం తీసుకుందట.

See also  Rashmika Mandanna: ప్రేమికుల రోజు న తన మనసులో మాట బయటపెట్టిన రష్మిక మందన ట్వీట్ వైరల్

sree-mukhi-stops-acting-in-films-as-a-result-of-rashmi

మంచి కథలు వస్తేనే సినిమాలో నటించాలని లేకపోతే యాంకర్ గానే ఉండాలని చూస్తుందట. రష్మి చేసిన తప్పే నేను చేస్తే రష్మికి పట్టిన గతే నాకు పడుతుందని.. అందుకోసమే సినిమాలు నటించకూడదని నిర్ణయం తీసుకున్నదట. కానీ మంచి పాత్ర వచ్చే కచ్చితంగా చేస్తుందట. ఇప్పటి నుండే తను ఎలాంటి సినిమాల్లో నటించాలన్న విషయాన్ని ఆచితూచి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో మాత్రమే నటించాలని నిర్ణయం తీసుకుందట. దీంతో రష్మీ సినీ కెరియర్ శ్రీముఖికి ఒక మంచి గుణపాఠంగా మారిందని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.. దాంతో ఈ విషయం వైరల్ గా మారింది.