Soundarya : కొంతమంది బ్రతికున్న చనిపోయిన ఎప్పుడూ కూడా మనుషుల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు ( Soundarya mother sentiment comments ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో సావిత్రి తర్వాత అంత గొప్పగా హృదయంలో దాచుకునే నటి సౌందర్య అని చెప్పుకోవాలి. మనవరాలు పెళ్లి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సౌందర్య ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. హీరోలతో సరిసమానంగా ఆమె తులతూగింది. స్టార్ హీరోలు సైతం సౌందర్య డేట్స్ చూసుకొని ఆ హీరోయిన్ నే నాకు కావాలని అడిగి మరి ఆమె డేట్స్ చూసుకొని దాన్నిబట్టి సినిమాను ఫిక్స్ చేయమని చెప్పేవారు. అతి తక్కువ సమయంలోనే అనేక భాషల్లో ఎన్నో సినిమాలను నటించి ఎంతో మంది ప్రేక్షకుల్ని తన అభిమానులు చేసుకున్న గొప్ప నటి సౌందర్య.
అమాయక పాత్రైనా, ఒక గట్టి మహిళ పాత్ర అయినా, ఒక ప్రేమికురాలుగా, ఒక భార్యగా అన్ని పాత్రల్లో ఆమె తన ట్యాలెంట్ ని చూపించింది. విక్టరీ వెంకటేష్ తో నటించిన ఆమె సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ( Soundarya mother sentiment comments ) వచ్చే సినిమా అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలో వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ దురదృష్టమో లేక సినీ అభిమానుల దురదృష్టమో తెలియదు గాని అతి చిన్న వయసులోనే కేవలం 31 సంవత్సరాల వయసులోనే సౌందర్య చనిపోయింది.
సినిమా రంగంలో మంచి స్టార్ హీరోయిన్గా వెలుగుతుండగానే ఆమె పెళ్లి చేసుకుని, ఆ తర్వాత పాలిటిక్స్ లో తిరుగుతూ.. ఒక హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆమె, ఆమె సోదరుడు ఇద్దరు మరణించారు. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరు ( Soundarya mother sentiment comments ) బిడ్డలను పోగొట్టుకున్న ఆ తల్లి అంటే సౌందర్య తల్లి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించవచ్చు. ఆమె కొంతకాలం సిక్ అయిపోయాయి.. మీడియా వాళ్ళతో గాని ఎవరితో గాని ఏమీ మాట్లాడకుండా బిడ్డలను పోగొట్టుకున్న శోకంతో కృంగిపోతూ బతికింది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్య తో ఆమె చెప్పిన కొన్ని సంగతులకి సౌందర్య అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
సౌందర్య తల్లి మాట్లాడుతూ.. నాకు ఇప్పటికీ మనసు బాగోకపోతే పడుకుంటే నా పిల్లలిద్దరూ కలలోకి వస్తారు. ముఖ్యంగా సౌందర్య ప్రతిరోజు నా కలలోకి వచ్చే నీకెందుకు మమ్మీ నేను ఉన్నాను గా అంటూ ఉంటాది అని చెబుతూ.. ఆమె ఏడ్చింది. ఇన్నేళ్లయినా ప్రతిరోజు సౌందర్య కల్లోకి రావడం అంటే అది ఒక పెద్ద షాకింగ్ లాగా ఉంది. అంటే ఆమె మనిషి అంటే పోయింది కానీ.. ఆమె మనసు ఇంకా ఆమె మనుషుల చుట్టూ.. ఆమెకి ఇష్టమైన ప్రదేశంలోనే తిరుగుతూ, వాళ్ళని రక్షిస్తూ, వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉందేమో అని నెటిజనులు అంటున్నారు. సౌందర్య చనిపోయి ఇనీళ్లవుతున్నా.. ఇంకా ఆమెని అభిమానులే మరచిపోలేదంటే ఆమె తల్లికి ఎలా మరుపు సాధ్యమని నెటిజనులు వాపోతున్నారు.