Home Cinema Jailer: జైలర్ సినిమాకి సెలవుతో పాటు ఫ్రీ గా టికెట్స్ కూడా ఎవరికో తెలుసా?

Jailer: జైలర్ సినిమాకి సెలవుతో పాటు ఫ్రీ గా టికెట్స్ కూడా ఎవరికో తెలుసా?

some-companies-in-those-cities-are-giving-a-holiday-and-free-tickets-for-jailer-movie

Jailer: ఇండియాలో అన్ని భాషల వారికి రజనీకాంత్ అంటే సుపరిచితమే. తెలియడం మాత్రమే కాదు ఆయనంటే విపరీతమైన ఇష్టం కూడా. రజనీకాంత్ ఇంత వయసు వచ్చినా కూడా ఇప్పటికీ ఆయన హీరోఇజం. స్టైల్ ఎక్కడికి పోలేదు. అందుకే ఆయన సినిమాని అన్ని భాషల్లోకి డబ్ చేసి ప్రమోట్ చేస్తారు. చిత్ర టీం ( free tickets for Jailer movie ) వాళ్ళు ఇప్పటికీ ఆయనపై భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు అంటే నిజంగా ఆయన సూపర్స్టారే. తమిళ్ నాడులో ఈయనకు ఉన్న క్రేజ్ చూస్తే.. అభిమానుల ఇష్టాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు జైలర్ సినిమా రేపు రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై రజనీకాంత్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

See also  Actress Meena: ఆ స్టార్ హీరో షూటింగ్ స్పాట్ లోనే హీరోయిన్ మీనా గూబ గుయ్యిమనిపించాడా.?

some-companies-in-those-cities-are-giving-a-holiday-and-free-tickets-for-jailer-movie

రజనీకాంత్ కి గత కొంతకాలంగా బ్లాక్బస్టర్ హిట్ అనేది లేదు. నిజం చెప్పాలంటే చాలా సినిమాలు డిజాస్టర్ గా కూడా మిగిలాయి. కబాలి, కాలా ,2.0 ,పేట, దర్బార్ సినిమాలు విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయి కూడా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పడిపోయాయి. అందుకే ఇప్పుడు జైలర్ సినిమాపై ఆయన అభిమానులు ఎంతో ( free tickets for Jailer movie ) ఆశతో, ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు విపరీతంగా పెరగడమే కాకుండా.. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని, ప్రేక్షకులు ఆదరించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అసలు రజనీకాంత్ అంటే కొందరికి ఎంత అభిమానం ఉంటుందో తెలియాలంటే కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

some-companies-in-those-cities-are-giving-a-holiday-and-free-tickets-for-jailer-movie

రజనీకాంత్ సినిమా జైలర్ రిలీజ్ అవుతుందని ఆగస్టు 10వ తేదీని కొన్ని ఊర్లలో కొన్ని సంస్థలు సెలవులు ఇస్తున్నాయి. సెలవివ్వడమే కాకుండా, జైలర్ సినిమాకి టికెట్ కూడా ఆ కంపెనీలో ఫ్రీగా వాళ్ళ ఉద్యోగులకు అందిస్తున్నాయి. చెన్నై, బెంగళూరులోని ఆఫీసులకు సెలవిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు చెందిన ఒక సంస్థ ( free tickets for Jailer movie ) ఉద్యోగులకు సెలవులు ప్రకటిస్తూ నోటీసు విడుదల కూడా చేశారు. ఈ కంపెనీ సెలవు చెన్నై, బెంగళూరు, తిరుచు , తిరునవ్వేలి, చెంగల్ పట్టు, అరఫలయం, అలగప్ప నగర్ బ్రాంచ్ లకు అన్నిట్లోనూ కూడా సెలవును ప్రకటించింది. దానితోపాటు వాళ్ళ ఉద్యోగులకు ఆ సినిమా టికెట్స్ కూడా అరేంజ్ చేస్తుంది.

See also  Prabhas-Anuskha: ఆ హీరోతో అనుష్కకు ఎఫైర్ ఉన్నందునే ప్రభాస్ తనను దూరం పెట్టాడా.??

some-companies-in-those-cities-are-giving-a-holiday-and-free-tickets-for-jailer-movie

ఇంచుమించుగా రెండేళ్ల తర్వాత స్క్రీన్ పై మెరవబోతున్న రజనీకాంత్ కోసం అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సాధారణంగా అభిమానులు సినిమా కోసం ఎదురు చూస్తే.. సినీ ఆవిమానులు అందరూ రజనీకాంత్ ను చూడడం కోసం ఎదురుచూస్తున్నారు. అంత గొప్ప నటుడు రజనీకాంత్. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఉంది. అసలు రజనీకాంత్ – రమ్యకృష్ణ కాంబినేషన్ అనగానే చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ఇంతకుముందు మనందరికీ తెలిసిందే. ఆ సినిమా పేరే నరసింహ. ఈ సినిమాని ఇప్పటివరకు కూడా ఎవ్వరూ మర్చిపోలేదు. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కలిసి వచ్చి ఇప్పుడు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.