Sneha Affair: పద్ధతికి మారుపేరుగా నిలిచినటువంటి సౌందర్య మరణాంతరం ఇండస్ట్రీలో ట్రెడిషనల్ బ్యూటీ గా చలామణి అవుతున్న హీరోయిన్ స్నేహ. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి వివాదాలలో ఇరుక్కోకుండా సక్సెస్ఫుల్గా ఇటు తన జీవితాన్ని అట్టు తన సినీ కెరియర్ ను కొనసాగిస్తున్నదని మనందరికీ తెలిసిన విషయం.. కానీ ఇప్పటివరకు ఎలాంటి వివాదాలకు తెరలేపని స్నేహ జీవితంలో కూడా కొన్ని లవ్ ట్రాక్ లు పలు మలుపులు తిప్పాయన్న పలు వార్తలు సంచలనంగా మారాయి. మరీ ముఖ్యంగా ఎలాంటి మచ్చ లేని స్నేహ ఓ స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడిపిందన్న వార్తలు అప్పటి మీడియాలో సంచలమైన వార్తలుగా నిలిచాయి. మరి ఆ స్టార్ హీరో ఎవరు? ఆ లవ్ ట్రాక్ ఏంటి? వంటి పలు విషయాలు ఇప్పుడు మనం చర్చిద్దాం..
గోపీచంద్ హీరోగా నటించినటువంటి తొలివలపు చిత్రంతో స్నేహ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలి అడుగు వేసింది. ఇక ఈ చిత్రమే తెలుగు సినిమా రంగంలో ఆమె హీరోయిన్ గా అడుగు పెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత ఎన్నో రకాల లవ్ యాక్షన్ చిత్రాలలో తాను నటించింది. స్నేహ నటించినటువంటి పలు చిత్రాలు చూసుకున్నట్లయితే.. వెంకీ, సంక్రాంతి, ప్రియమైన నీకు, శ్రీరామదాసు, ఏమండోయ్ శ్రీవారు, రాధాగోపాలం, పాండురంగడు మొదలైనటువంటి చిత్రాలలో ఈమె నటించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాలను కైవసం చేస్తుంది.
అలాంటి హీరోయిన్ స్నేహ ఎక్స్పోజింగ్ అంటే చాలా దూరంగా ఉంటున్నటువంటి ఆమె సినిమాల పరంగా కెరీయర్ పీక్స్ లో ఉన్న టైంలోనే అప్పటికే నటుడు ప్రసన్న కుమార్ తో మంచి రిలేషన్షిప్ ను మొదలుపెట్టిన ఆమె అతడిని వివాహం ఆడింది. ఇక ఆ తర్వాత లైఫ్ లో చాలా బిజీగా తన జీవితాన్ని గడుపుతూ ఇండస్ర్టీకి గుడ్ బై చెప్పింది. అలా కొన్నేళ్ళ పాటు ఇండస్ర్టీకి దూరంగా ఉన్న స్నేహ ఒక బాబు పాప పుట్టాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సన్ ఆఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి చిత్రాలలో నటించింది. అలాంటి స్నేహకు ఓ హీరో తో ఎఫైర్ కొనసాగించింది అనే వార్తలు వైరశ్ అవుతున్నాయి. మరి ఆ హీరో మరెవరో కాదు అక్కినేని నాగార్జున.
ఇక వీళ్ళిద్దరి కాంబినేష్ లో వచ్చిన చిత్రాలు చూసుకుంటే శ్రీరామదాసు, రాజన్న వంటి చిత్రాలలో అక్కినేని నాగార్జున, స్నేహ (Sneha Affair) కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలలో నటిస్తున్న సమయంలో స్నేహ నాగార్జునతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగిందట.. ఇక ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తయ్యాక కూడా వీళ్ళిద్దరూ బయట తిరిగేవారట. కాగా ఈ విషయం అప్పట్లో మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉన్నదనేది ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇక ఫిల్మ్ ఇండస్ర్టీ అంటేనే ఓ చిత్రం షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్ల నడుమ ఎంతో కొంత బాండింగ్ ఏర్పడుతుంది. దాని తర్వాత షూటింగ్ అనంతరం కూడా వీళ్ళు బయట మీడియా కంట పడతూ ఉంటారు. అలాంటి విషయాలను వాళ్ళు పెద్దగా పట్టించుకోరు.