Jaffer Sadiq : ఏ సినిమా తీసిన ఆ సినిమా అది బాగుందా? లేదా అని చెప్పేది ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ బట్టే. సినిమా మొదలు అని తలంచుకున్నప్పుడే ఆ సినిమా బడ్జెట్ని ఆలోచించుకొని.. ఆ బడ్జెట్ తగ్గట్టుగా ఆ ( Jaffer Sadiq movie collection details ) సినిమా కలెక్షన్స్ రాబడుతుందా లేదా అని ఆలోచించి.. ఆ భగవంతుని వేడుకుంటూ సినిమా మొదలుపెడతారు. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి.. విపరీతమైన కలెక్షన్స్ ని కురిపిస్తే.. మరికొన్ని సినిమాలు ఎంత బడ్జెట్ తో సినిమా తీసినా కూడా డిజాస్టర్ గా మిగిలి ఎంతో డబ్బుని నష్టపరుస్తాయి. సినిమాలో నటించిన వాళ్లకి మంచి పేరు వస్తుంది.
ఇక హీరో, హీరోయిన్స్ గురించి అయితే అసలు చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమా కానీ సక్సెస్ అయితే 100% నేమ్ వాళ్లకు వస్తుంది. అలాగే దర్శకుడు కూడా మంచి పేరు వస్తుంది. ప్రస్తుతం బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా అవడం వలన కలెక్షన్స్ వర్షం బానే కురుస్తుంది. ఒకవేళ సినిమా గాని ( Jaffer Sadiq movie collection details ) బాగుంటే అన్ని ప్రాంతాల నుంచి విపరీతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమాలు మొత్తం కలిపి 2200 కోట్లు సాధించాయి. అలాగే అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా 1600 కోట్లు సాధించింది. షారుఖ్ ఖాన్ సినిమాలు పఠాన్, జవాన్ సినిమాలు 2000 కోట్లు వచ్చాయి. మరొకవైపు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టార్ గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా 1000 కోట్లు పైనే తీసుకుని వచ్చింది.
అయితే ఇందులో విశేషమైనటువంటి ఇన్ని కోట్లు సంపాదించిన సినిమాల్లో మూడు సినిమాలు బాహుబలి 1 బాహుబలి 2 ఆర్ఆర్ఆర్ ఈ మూడు సినిమాలు కూడా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమాలు. ఇక ఈ హీరోల సంగతి వస్తే కలెక్షన్స్ రాబట్టిన హీరోలంటే విపరీతమైన డిమాండ్ క్రేజీ పెరుగుతుంది. అలాగే ( Jaffer Sadiq movie collection details ) ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క హీరోకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి, తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ కి, హిందీ బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ కి ఓ ప్రాముఖ్యత ఉంది. వీళ్ళ సినిమాల కలెక్షన్స్ ఒక సంచలనాన్ని సృష్టిస్తాయి. అలాంటి హీరోలతో పోల్చుకుంటే ఒక సాదాసీదా నటుడు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.
తమిళనాడుకు చెందిన జాఫర్ సాదిక్.. ఇతను పెద్ద స్టార్ హీరో కాదు. ఒక సాదాసీదా క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇతను నటుడు కాకముందు డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. తర్వాత ముఖ్యంగా మూడు సినిమాల్లో నటించి 2000 కోట్లకు పైగా కలెక్షన్ ని వసూలు చేశాయని వార్తలు వస్తున్నాయి. ఇక విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు జాఫర్. ఇతను హైట్ చూస్తే చాలా తక్కువ ఉంటాడు. 4.8 అడుగులు మాత్రమే. కానీ ఇతను సాధించిన విజయాలను చూస్తే.. పొట్టోడు గట్టోడు అని అందుకే అంటారు అని అనుకుంటారు. జాఫర్ వరుసగా నటించిన మూడు సినిమాల్లో అతను 2000 కోట్ల పైగా కలెక్షన్ తీసుకొచ్చాడు. విక్రమ్, జైలర్,జవాన్ ఈ మూడు సినిమాల్లో నటించాడు. అతను నటించిన మూడు సినిమాలు కలెక్షన్స్ కలిపి 2000 కోట్ల పైగా రావడంతో స్టార్ హీరోల కంటే.. ఒక సాదాసీదా నటుడు నటించిన సినిమాలకి ఇంత కలెక్షన్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తని హల్చల్ చేస్తున్నారు. జాఫర్ 2022లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించాడు..