
Jawan: షారుక్ ఖాన్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఒక ఇండియన్ స్టార్ మీద అన్ని దేశాల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో అంటే షారుక్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి షారుఖ్ ఖాన్ ( Jawan first Day collection ) గత నాలుగు సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దానికి ముందు ఆయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ లేవు. ఆ కారణంగా ఆయన నాలుగు సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయినా కూడా షారుక్ ఖాన్ మీద అభిమానం, క్రేజ్ గాని అభిమానులకు ఎక్కడ తగ్గలేదు.
నాలుగు సంవత్సరాల తర్వాత షారుఖ్ ఖాన్ 4 అడుగులకు వెనక్కేసి.. ఒకేసారి ఎన్నో అడుగులు ముందుకేసేటట్టుగా పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పఠాన్ సినిమా సంచలనాన్ని సృష్టించి.. 1000 కోట్లను కొల్లగొట్టింది. మొదటి రోజే ( Jawan first Day collection ) భారత దేశంలో 55 కోట్లు కలెక్షన్లో తీసుకొని వస్తే, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసింది. పటాన్ సినిమా చూసిన తర్వాత షారుఖ్ మరొకసారి నిద్ర లేచాడని, మళ్లీ తన సత్తాను చాటాడని అందరూ అనుకున్నారు. ఆయన పఠాన్ సినిమా సృష్టించిన రికార్డు.. సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఒక్కసారిగా మళ్లీ షారుక్ ఖాన్ రోజుల్ని గుర్తు చేసింది.
పటాన్ సినిమా రికార్డు తర్వాత మళ్లీ సెప్టెంబర్ 7వ తేదీన జవాన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలైతే ముందుగానే ఉన్నాయి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి ముందు పటాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఒక సినిమా అంచనాలను సినిమానే బ్లాక్బస్టర్ చేయడం కొంతవరకు ఈజీ ( Jawan first Day collection ) ఉంటుందేమో గాని.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమాని సక్సెస్ చేయడం, ఆడియన్స్ ని మెప్పించడం కొంత కష్టంగానే ఉంటుంది. అయినా కూడా జవాన్ సినిమా ఎక్కడా కూడా లొంగలేదు. ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ సాధించింది. హిట్ అంటే మామూలు హిట్టు కాదు బ్లాక్ బస్టర్ కొట్టి సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది.
జవాన్ సినిమా రిలీజ్ అయిన మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అదరగొట్టాడు అని అనిపించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని అందరి నోటి నుంచి వినిపించుకుంది. ఇక కలెక్షన్ల గురించి చూస్తే సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. మొదటి రోజు కలెక్షన్ లోనే అన్నిటిని దాటేసింది. ఇండియాలో అన్ని భాషల్లోనే కలుపుకొని మొదటి రోజు 75 కోట్లు కలెక్షన్లు సాధించిన సినిమా ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు కలెక్ట్ చేసి జవాన్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు హైయెస్ట్ కలెక్షన్ చేసే సినిమాలు అంటే.. పఠాన్ 55 కోట్లు, కేజిఎఫ్ 54 కోట్లు, బాహుబలి 41 కోట్లు మాత్రమే మొదటి రోజు కలెక్షన్ వసూలు చేశాయి. షారుక్ ఖాన్ సినిమా జవాన్ ఇప్పుడు వాటన్నిటిని దాటేసింది. ఏకంగా మొదటి రోజు 75 కోట్లు రాబట్టి ఒక రికార్డును సృష్టించింది. కలెక్షన్స్ లో షారుఖ్ ఖాన్ కింగ్ అంటూ మళ్ళీ నిరూపించింది. మొదటి రోజే ఇంత రికార్డులను సృష్టించిన ఈ సినిమా ఇంకొద్ది రోజుల్లో ఇంకెలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని అందరు ఎదురుచూస్తున్నారు. 57 సంవత్సరాల వయసులో కూడా షారుక్ ఖాన్ సింహాసనం పై ఆదిపత్యం చెలాయిస్తూ అందరికీ షాక్ ని ఇస్తున్నాడు.