Home Cinema Mrunal Thakur: సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమయ్యిందని షాక్ అవుతున్నారు..

Mrunal Thakur: సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమయ్యిందని షాక్ అవుతున్నారు..

Seetharamam heroine Mrunal Thakur gave big shock to audience: సీతారామం అనే సినిమా పేరు వినగానే.. అందం, అభినయం, సాంప్రదాయం అన్ని కలబోసిన మృణాల్ ఠాకూర్ గుర్తుకువస్తుంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. నిజానికి ఈ హీరోయిన్ పేరు చాల మందికి తెలియదు. ఈమెని సీత గానే చాలామంది సంబోధిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథా చిత్రం నిజంగా ప్రతీ ఒక్కరి మనసులను ఆకట్టుకుంది. చాల కాలం తరవాత ఒక చక్కటి ప్రేమ చిత్రం చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కు కలిగింది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఆ పాత్రలో లీనమైపోయింది. ఆమె మాత్రమే కాదు, ఆ సినిమా చూస్తున్న ప్రతీ ఒక్కరు ఆమె పాత్రను అంత లీనపమౌతూ చూసారు.

See also  Ram Charan : ఉపాసన కంటే ముందు రామ్ చరణ్ ఘాడంగా ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ చనిపోయింది.. కారణం..

seetharamam-heroine-mrunal-thakur-gave-big-shock-to-audience

సీతారామం సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ నటించారు గాని, తొలి సినిమాతోనే తెలుగు వారి దగ్గర మంచి పేరు మాత్రం మృణాల్ ఠాకూర్ ( Seetharamam heroine Mrunal Thakur gave big shock to audience ) కొట్టేసింది. ఈ సినిమాలో సీత కోసం హీరో వెతికే క్రమంలో ఆడియన్స్ కూడా బాగా లీనం అయ్యారు. సీత ఎలా ఉంటాదో చూడాలనేంతగా సినిమాలో లీనం అయ్యారు. నిజంగానే ఆడియన్స్ ఎదురు చూపులకు, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur )న్యాయం చేసింది. ఆమె నటన, నాట్యం, కట్టు, బొట్టు అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే ఆ సినిమా తో ఆమెకు అంత ఫేమ్ వచ్చింది. అంతే ఒక్క సినిమా సూపర్ హిట్ కొడితే, హీరోలకు వరసగా ప్రాజెక్ట్స్ రావాలంటే కొంచెం కష్టం గాని, హీరోయిన్స్ కి మాత్రం వెంటనే వరుసగా స్టార్ హీరోల పక్కన ఆఫర్స్ వచ్చేస్తాయి.

See also  Ram Charan - Sai Pallavi : రామ్ చరణ్ సాయి పల్లవి కలసి పాపం వాళ్ళని..

seetharamam-heroine-mrunal-thakur-gave-big-shock-to-audience

అలాగే మృణాల్ ఠాకూర్ కు కూడా సీతారామం సినిమా హిట్ తరవాత వరస ఆఫర్స్ వచ్చాయి. మలయాళంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా ఆధారంగా హిందీ లో సెల్ఫీ అనే సినిమా తీశారు. అందులో అక్షయ్ కుమార్ , ఇమ్రాన్ హ‌ష్మీ హీరోలుగా నటించారు. ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ తో తీయగా.. ఇలాంటి పెద్ద సినిమాలో మృణాల్ ఠాకూర్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో అక్షయ్ పక్కన ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఈ పాటలో మృణాల్ ఠాకూర్ ని చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. సీతారామం సినిమాలో సీత పాత్రకు పూర్తి భిన్నంగా.. బాగా ఎక్సపోజ్ చేస్తూ పాటలో కనిపించింది. డీసెంట్ లుక్ తో ఉంటె, అలానే ఆడియన్స్ అలవాటు పడితే కమర్షియల్ హీరోయిన్ గా నిలబడలేనని అనుకుందో ఏమో గాని చాలా తేడాగా కనబడింది.

See also  Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం...

seetharamam-heroine-mrunal-thakur-gave-big-shock-to-audience

పోనీ ఇంతగా చూపించినా కూడా, నార్త్ లో ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకోలేదు. పైగా సినిమా మొదటి షో తోనే నెగటివ్ టాక్ రావడంతో అసలు ఈ సినిమా గురించి జనాలు పెద్దగా పట్టించుకోనిది ఇంక ఈమె పాటని ఎవరు పట్టించుకుంటారు. అయితే అక్షయ్ తో తన అందాలను ఆరేస్తూ నటించిన ఆ పాటకు సంబంధించిన ఇమేజ్ లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమయ్యిందని నెటిజనులు షాక్ అవుతున్నారు.