Sarath Babu : 1973లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 2023 వరకు అంటే నాలుగు దశాబ్దాలను తన నటనతో అలరించిన శరత్ బాబు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. దర్శకుడు ఆయనకిచ్చిన ప్రతి పాత్రను శరత్ బాబు ఆ పాత్రలో జీవం పోసుకుని.. ఆ పాత్ర కోసం శరత్ బాబు అయితేనే బాగుంటుందని.. అంతగా ( Sarath Babu comments about ) పరకాయ ప్రవేశం చేసి నటించే గొప్ప నటుడు. ఆయన సినిమా రంగంలో ఎటువంటి సమస్యలు లేకుండా.. ఆయన ప్రయాణం తాపీగా, అద్భుతంగా సాగిపోయింది కానీ.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి చూస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్టుగానే కనిపిస్తుంది. శరత్ బాబు జీవితంలో పెళ్లి అనే మాట ఎంతవరకు కలిసి వచ్చిందో చెప్పాలంటే పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి.
సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కెరియర్ ఎంత బాగున్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్ అంతకంటే బాగుంటేనే ఆనందం. అలాంటిడి శరత్ బాబు జీవితంలో పెళ్లి అనే కాన్సెప్ట్ పెద్దగా కలిసి రాలేదు. శరత్ బాబు తనకంటే వయసులో పెద్దదైన రమాప్రభని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. శరత్ బాబు రమాప్రభ తో కలిసి 14 ఏళ్ల పాటు జీవితాన్ని ( Sarath Babu comments about ) ఎంతో అన్యోన్యంగా సాగించారు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒకరితో ఒకరికి సరిపడక విడిపోవడం జరిగింది. విడిపోయేటప్పుడు రమాప్రభ ఆయనపై ఎన్నో ఆరోపణలు కూడా చేశారు. శరత్ బాబు తనను మోసం చేశారని, తన ఆస్తులు అన్ని లాక్కుని వదిలేసారని ఇలా ఎన్నో నిందలు వేశారు. అయితే వీటన్నిటిలో ఎంత నిజం ఉంది? పర్సనల్ లైఫ్ లో శరత్ బాబు క్యారెక్టర్ ఏమిటి అనేది ఎవరికీ పెద్దగా తెలియలేదు.
శరత్ బాబు రమాప్రభ ను వదిలేసిన తర్వాత ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. తమిళ నటుడు నంబియార్ కూతురు స్నేహలత ని పెళ్లి చేసుకోవడం జరిగింది. స్నేహలత తో కూడా కొంతకాలం ఉండి, ఆ తర్వాత ఆమెతో కూడా పడక.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో విడిపోయారు. రెండో భార్యను కూడా వదిలేసిన తర్వాత శరత్ బాబు ( Sarath Babu comments about ) కొంతకాలం ఒంటరిగానే జీవితాన్ని గడిపారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని అనేక ప్రశ్నలు అడుగుతున్న యాంకర్ మీకు పిల్లలు లేరా అని అడగగా.. ఆయన వెంటనే తన సోదరులు, సోదరీమణులు పిల్లలు 25 మంది ఉన్నారని వాళ్లంతా తన పిల్లలే అంటూ సమాధానం ఇచ్చారు. దీనితో శరత్ బాబుకి 25 మంది పిల్లలు అన్నమాట అని నెటిజన్లు కామెంట్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే శరత్ బాబు రెండవ పెళ్లి రెండో భార్యను వదిలేసిన తర్వాత మూడో పెళ్లి ప్రయత్నం కూడా చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ చేశాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న రమాప్రభ ని శరత్ బాబు వదిలేసిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్న స్నేహలతను కూడా వదిలేసిన తర్వాత.. శరత్ బాబు నటి నమితను ప్రేమించారని, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అనేక ప్రచారాలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత నమిత ఈ ప్రచారం చూసి.. నాకు అసలు శరత్ బాబు అంటే ఎవరో తెలియనే తెలీదు. మీరు ఇలాంటి ప్రచారాలు చేసిన తర్వాత నేను గూగుల్ లో ఆయన గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నాను. నాకు అతనికి ఎలాంటి రిలేషన్ లేదు. మా ఇద్దరికి ఎలాంటి వివాహం జరగలేదు. ఇలాంటి తప్పుడు వార్తలని ప్రచారం చేయొద్దు అంటూ ఆమె గట్టిగా చెప్పింది. అప్పుడు ఆ వార్తలో నిజం లేదని జనం నమ్మారు..