Sandeep Kishan: తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలలో సందీప్ కిషన్ ఒకరు. ఇక ఇటీవలే ఆయన నటించిన తాజా సినిమా ఊరు పేరు భైరవకోన. దేవి చిత్రం ఈనెల అనగా ఫిబ్రవరి 10వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది. ముందు పాన్ ఇండియా స్థాయిలో మైఖేల్ చిత్రం తీయగా అది అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో సందీప్ ఆశలన్నీ ఊరి పేరు భైరవకోన మీద ఉన్నాయి. అయితే సందీప్ కిషన్ ఇటీవలే పాల్గొన్నావ్ ఇంటర్వ్యూలో తన లవ్ గురించి ఓ సీక్రెట్ ని బయటపెట్టాడు. అందులో భాగంగా నేను ఇప్పటివరకు ముగ్గురిని ప్రేమించానని వెల్లడించారు.
ఎంతో ట్రూ గా లవ్ చేసి నాలుగేళ్ల పాటు రిలేషన్స్ తో ఒక అమ్మాయితో మరొక అమ్మాయితో రెండేళ్లు మరొకరితో రెండేళ్లు సీరియస్ గా లవ్ లో ఉన్నానని కానీ అవేమీ అంతగా వర్కౌట్ అవ్వలేదని.. ప్రస్తుతం నేను ఉన్న పొజిషన్ నుంచి చూస్తే అవి నా జీవితానికి అంత ప్రాముఖ్యమైనవి కావని అనిపిస్తున్నాయని తెలిపాడు. నేను ప్రేమించిన ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.. అయితే ఏళ్ల తరబడి ప్రేమలో ఉన్న వారెవరు అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచాడు.
అయితే రెజీనా కసాంద్రతో ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ నాకు (Sandeep Kishan) తనకు మధ్య ఎలాంటి ఏదీ లేదని మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని నా బ్రేకప్ కష్టాలన్నీ తనే చూసుకుందని తెలిపారు ఇక పెళ్లి ఎప్పుడు అంటారా అంటే ఈమధ్య దాన్ని కూడా నమ్మడం మొదలెట్ట అదే సమయంలో బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కదా ఇక దానికి టైం ఉంది చూద్దాం అంటూ తెలిపాడు.