Home Cinema Samantha: మెట్టు మెట్టుకి కర్పూర హారతి పెట్టి సమంత ప్రత్యేక పూజలు..!!

Samantha: మెట్టు మెట్టుకి కర్పూర హారతి పెట్టి సమంత ప్రత్యేక పూజలు..!!

Samantha: అతి తక్కువ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగచైతన్య తో విడాకుల తర్వాత ఏదో ఒక రకంగా ఎప్పటికప్పుడు ఓ అంశంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల కాలంలో మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ విషయం తెలియడంతో అటు అభిమానులు ఇటు సెలబ్రెటీలు సమంతను త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

See also  Samantha : సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కొన్ని కోట్లకు వారసుడా?

samantha-special-poojas-aarthi-on-every-step

ఇదిలా ఉంటే సమంత తాజాగా నటించిన చిత్రం శకుంతలం ఈ సినిమా ఈవెంట్లో స్టేజ్ పై సమంత కన్నీళ్లు పెట్టుకుని వీడియో బాగా వైరల్ అయింది. దాంతో మరొకసారి వార్తల్లో నిలిచింది. అయితే ప్రస్తుతం మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది అది ఏంటో తెలుసుకుందాం.. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉన్న పలని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సమంత. ఈ సందర్భంగా కింద కొండ నుంచి పైన వరకు దాదాపు 800 మెట్లకి ప్రతి మెట్టుకు కర్పూర హారతి వెలిగించారు సమంత.

See also  Samantha: ప్రతీరోజు సమంత ఇంట్లో కొన్ని గంటల పాటు ఒక్కర్తే ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..

samantha-special-poojas-aarthi-on-every-step

తన ఆరోగ్యం బాగుండాలని అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని పలని సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించిందని సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. యశోద సినిమాతో అందరినీ మెప్పించిన సమంత తన తర్వాత చిత్రం శకుంతలం ఈనెల ఫిబ్రవరి 17న రిలీజ్ కావలసి ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా ఏప్రిల్ 14వ తారీఖున విడుదల కాబోతుంది.

samantha-special-poojas-aarthi-on-every-step

ఈ చిత్రాల తరువాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఖుషి చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. అలాగే హిందీ లో సిటాడెల్ అనే ఒక వెబ్ సిరిస్ లో కూడా తను నటిస్తుంది. ఆ భగవంతుడి దయతో సమంత త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు