Home Cinema Samantha-Mrunal: అందరి ముందు ఆ విషయం నేరుగా అడిగేసరికి మృణాల్..!! సమంత రియాక్షల్ ఎలా ఇచ్చిందంటే.??

Samantha-Mrunal: అందరి ముందు ఆ విషయం నేరుగా అడిగేసరికి మృణాల్..!! సమంత రియాక్షల్ ఎలా ఇచ్చిందంటే.??

Samantha-Mrunal: తెలుగు సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత.. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న శాకుంతలం సినిమా ప్రమోషన్ లో చాలా బిజీ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలుసు.. ప్రముఖ దర్శకుడైన గుణశేఖర్ తెరకెక్కించినటువంటి ఈ ఎపిక్ లవ్ స్టోరీ లో మలయాళ ఫేమ్ నటుడు దేవ్ మోహన్ అలాగే సమంత జంటగా కలిసి నటించారు. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఈ నెల ఏప్రిల్ 14వ తారీఖున భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వనున్నది. ఇదే క్రమంలో సమంత అలాగే చిత్ర బృందం కలిసి ఇటు సౌత్ లో అటు నార్త్ లో గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.

See also  Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

samantha-mrunal-thakur-chit-chat-went-viral

ఇక సమంత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సోషల్ మీడియా ఉపయోగించుకొని కూడా సమంత యాక్టివ్ గా అందరితో చిట్ చాట్ చేస్తూ చాలా ఆక్టివ్ గా ఉంటుంది. మరదే విధంగా పోయిన సంవత్సరం సీతారామం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకొని రాత్రికి రాత్రికి స్టార్ గా మారిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సమంతతో ట్విట్టర్లో చిట్ చాట్ చేసింది. ఇంకా శకుంతలను చూడటానికి నేను వెయిట్ చేయలేను.. మీరే నాకు స్ఫూర్తిదాయకం.. మరి మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం.? అంటూ ఆ విషయం నేరుగా సమంతని ప్రశ్నించింది.

See also  Lavanya Mehndi function: లావణ్య త్రిపాఠి మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్పెషల్ ఇదేనట..

samantha-mrunal-thakur-chit-chat-went-viral

ట్విట్టర్ వేదికగా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. దీంతో మృణాల్ ఠాకూర్ కు సమంత (Samantha-Mrunal) షాకింగ్ సమాధానమే ఇచ్చింది. నాకు ఈ ఐడియా నచ్చింది.. మనిద్దరం కలిసి ఓ సినిమా చేద్దాం అంటూ వెంటనే రిప్లై ఇచ్చింది సామ్.. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా లవ్లీ గా చిట్ చాట్ చేసుకోవడం అభిమానులకి ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో వీళ్లిద్దరి మధ్య జరిగిన ఈ ముచ్చట నెట్టింట చెక్కర్లు కొడుతుంది. నెటిజన్లు కూడా వీళ్ళిద్దరి కాంబోలో ఏదైనా సినిమా వస్తే నిజంగానే బాగుంటుంది చూడాలనుంది కామెంట్స్ పెడుతున్నారు.

samantha-mrunal-thakur-chit-chat-went-viral

తన జీవితాన్ని సీరియల్స్ ద్వారా బుల్లి తెరలో మొదలు పెట్టిన మృనాల్ ఆ తర్వాత వెండి తెర ద్వారా సినిమాల్లో అడుగు పెట్టింది. బాలీవుడ్లో దాదాపు అరడజను పైగా చిత్రాల్లో నటించి తనెంటో నిరూపించుకుంది. ఇక పోయిన సంవత్సరం విడుదలైన సీతారామం చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టింది. అందులో ప్రత్యేకంగా సీతామాలక్ష్మి పాత్రలో మృణాల్ అద్భుతంగా ఒదిగిపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాలు ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆరు నెలల సమయం ఎదురు చూసి చాలా మంచిగా ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంది మృణాల్.. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని 30వ చిత్రంలో ఈ అమ్మడు హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.