Samantha Fires: స్టార్ హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమంత అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం. సినిమా రంగంలో అతి సామాన్యంగా ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఎన్నో హిట్ల ను సొంతం చేసుకుని.. ఎందరో స్టార్ హీరోలు సరసం నటించి.. తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న హీరోయిన్ సమంత. చూడ్డానికి ఎంతో సౌమ్యంగా, చిలిపిగా , చిన్నగా కనిపించే ఈ అమ్మడు ఎన్నో ఘనవిజయాన్ని సాధించి పెట్టేసింది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తెలుగువారి గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని వేసేసుకుంది.
ఆ తర్వాత ఆమె జీవితంలో పెద్ద మలుపు అంటే ఆమె పెళ్లి. ఎందుకంటే ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంతా, నాగ చైతన్య ఒకరితో ఒకరు మంచి స్నేహంగా మెలిగి ఆ తర్వాత దాన్ని ప్రేమగా మార్చుకున్నారు. వీరిద్దరి జంట అంటే యావత్ సినీ వర్గానికి అందరికీ.. సినీ అభిమానులకు వాళ్ళిద్దరి ప్రత్యేకించి అభిమానులకు అందరికీ కూడా పిచ్చి ఇష్టం. ఎందుకో తెలియదు ఒక్కొక్క జంటలో ఒక్కొక్క అట్రాక్షన్ ఉంటుంది. ఈ జంటలో కూడా అలాంటి మంచి అట్రాక్షన్ ఉంది. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవడం, వినడం కూడా ఆనందంగా ఉంటుంది. (Samantha Fires)
అలాంటి వీళ్లిద్దరూ కొంతకాలం ప్రేమించుకుని.. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ.. వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. వీళ్లిద్దరు విడిపోయిన తర్వాత అనేక విమర్శలకు గురవుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు ఏదో రూపంలో విమర్శలకు గురవుతున్నారు. అందులో సమంత కొంచెం ఎక్కువగా విమర్శలకు గురవ్వక తప్పడం లేదు. ఎందుకంటే నాగార్జున కుటుంబం చాలా సింపుల్ గా సైలెన్స్ గా ఉండే కుటుంబం అని అందరికీ తెలుసు. అటువంటి వాళ్ళతో కూడా మసల లేకపోతే సమంత ఇంకెవరిని చేసుకుని ఎక్కడ మసులుతుందని నెటిజనులు వాపోతున్నారు.
అయితే సమంత విడాకులు తీసుకున్న తర్వాత ఒకసారి తన మాజీ అత్తగారు దగ్గుపాటి లక్ష్మి ఎదురైందంట. ఆమెతో మాటలు కలిపి చైతుతో తన పెళ్లి చాలా ఆనందంగా జరిగిందని.. మేమిద్దరం కలిసి చాలా ఆనందంగా బ్రతికామని కానీ కొన్ని రోజుల తర్వాత చైతు నన్ను కమాండ్ చేయడం మొదలుపెట్టాడని.. కుటుంబం అంతా కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవాలనుకున్నారని.. సినిమాలు చేయొద్దు అని అంటున్నారని.. ఒకవేళ సినిమా నా పర్సనల్ సంసార జీవితమా అని ఆలోచిస్తే.. సినిమాను వదిలేయాలి అనే లెవెల్లో వాళ్ళు నన్ను ప్రేజర్ పెట్టారని అందుకే నేను విడాకులకు మొదట అడిగి.. చైతుతో విడిపోయానని చెప్పుకొచ్చిందంట. ఇలా చైతు గురించి తన మాజీ అత్తగారికి సమంత చెప్పడం జరిగిందంట