Naga Chaitanya: మనకందరికీ తెలిసిన విషయమే.. నెట్టింట నాగచైతన్య సమంతల గురించి ఓ చిన్న వార్త బయటకు వచ్చిందంటే చాలు అది క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం చుట్టి వస్తుంది. అంత పాపులర్ అయిపోయింది సమంత నాగచైతన్య విడాకుల విషయం.. ఇక ఇప్పటికీ వీళ్లిద్దరు విడాకులు తీసుకుని మూడు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వీళ్ళిద్దరి విడాకుల గురించి అసలైన కారణం ఇప్పటివరకు ఎవరికీ తెలియడం లేదు. ఎన్నో రకాల వార్తలు ఎందరో వినిపించినప్పటికీ రోజుకొక వార్త మళ్లీ ఇందుకే వీళ్ళు విడిపోయారు అన్నట్లుగా పుట్టుకొస్తూనే ఉంది. మరొక విషయం అలాంటిదే వీరిద్దరి విడాకులకు సంబంధించింది ప్రస్తుతం ఒక వార్త బయటపడింది. (Samantha did such thing)
ఇక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఎవరో కాదు నాగచైతన్య.. ఇటీవల విడుదలైన తన కస్టడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన విడాకుల గురించి క్లారిటీ ఇస్తూ ఆ వార్తలపై స్పందించాడు చైతు.. అలా దానికి సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఆ రోజు రాత్రి ఫుల్ గా తాగి మద్యం మత్తులో ఆ పని చేసి ఉండకుంటే ఈ రోజు కచ్చితంగా మన ముందు వీళ్ళిద్దరూ చిలక గోరింకల్లా, టాలీవుడ్ లో మోస్ట్ రొమాటిక్ పెయిర్ గా ఉండే వాళ్ళట అని ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతూ ట్రెండ్ గా మారింది. అయితే మన టాపిక్ విషయంలోకి వెళ్ళినట్లయితే.. అక్కినేని నాగచైతన్య సమంత వీళ్లిద్దరూ విడాకులకు ముందు అంటే కలిసి ఉన్నప్పుడు ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్లారట..
ఇక ఆ పార్టీలో సమంతకు కాస్త డ్రింక్ ఎక్కువ అయిందట.. ఇక పార్టీ ముగించుకుని ఇంటికి వచ్చాక వీళ్లిద్దరి మధ్య ఏదో చిన్న గొడవ తలెత్తి ఆ గొడవ చాలా పెద్దదిగా మారిందట. ఇక గొడవ జరిగాక కూడా సమంత ఆ గొడవ విషయం మర్చిపోకుండా ఈగోలకు వెళ్ళిందట.. ఇదే కాకుండా సమంతకి ఉన్న ఆ అహంకారం వల్ల ఈ గొడవలు అన్నింటిని నాగార్జున వరకు తీసుకెళ్లిందట.. అయితే అక్కినేని నాగార్జున కూడా సమంతతో ఎంత గొడవలను సర్దుమనిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోయిందట.. ఇదే కాకుండా సమంత మద్యం మత్తులో ఉండడం వల్లనే తను ఏం మాట్లాడుతుందో కూడా తెలియనట్లుగా ప్రవర్తించిందట. (Samantha did such thing)
దాంతో వీళ్ళిద్దరికీ ఆ మద్యం మత్తులో ఉన్న రాత్రి చాలా పెద్ద గొడవలు జరిగాయట.. ఇక ఆ గొడవ తర్వాతే నాగచైతన్య ఇలా కలిసి ఉండి కొట్టుకోవడం కంటే విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటే చాలా మంచిది అనే ఒక అంగీకారానికి వచ్చాడట. కానీ నాగార్జున మాత్రం వీళ్ళిద్దరిని కూల్ చేయడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదంట.. దీంతో నాగార్జున కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి సైలెంట్ అయిపోయాడట. అయితే ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరొకసారి సమంత అక్కినేని అభిమానులు ట్రోల్ చేస్తూ ఉన్న్నారు.