Sam and Sreeja: సినిమా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సంభవిస్తుంటాయి. ఎంతో మంది హీరో హీరోయిన్లు ప్రేమించి ఇరు కుటుంబాలలోని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటారు. అలా చేసుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సమంత నాగచైతన్య ల గురించి మనకు తెలుసు.. ఇలాంటి జంట విడిపోవడానికి కారణం ఒకరని సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. ఇక ఇదే కాకుండా చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల కూడా కళ్యాణ్ దేవ్ తో విడిపోవడానికి కారణం కూడా అతడే అంట.! వీళ్ళిద్దరూ తమ జీవితాలను నాశనం చేసుకొని విడాకులు తీసుకునే వరకు వెళ్లడానికి కారణమైంది ఒక్కరే అన్న విషయాన్ని తెలవడంతో అందరూ షాకింగ్ కు’ గురవుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఎప్పటినుంచో సమంతకి హెయిర్ స్టైలిస్ట్ గా ఉంటున్నాడు ప్రీతం జుకాల్కర్. వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్ గా ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలను చూస్తే మనందరికీ అర్థమవుతుంది. మరి కళ్ళ ముందు నాగచైతన్యకి ఇంకా ఎంత క్లోజ్ గా ఉంటాడో మనందరం ఊహించు కోవచ్చు.. కానీ అలా ఉండడం నాగచైతన్య జీవించుకోలేకపోయాడని, అందువల్లే వీరిద్దరి మధ్య గొడవలు జరిగేవనీ.. ఆ కారణం చేత వీళ్లిద్దరు విడిపోయారంటూ.. గతంలో ఓ రూమర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ప్రచారమైందన్న సంగతి మనందరికీ తెలుసు..
కానీ ఈ విషయంలో ఈ రూమర్స్ పై ప్రీతం జుకాల్కర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. సమంత నాకు అక్క లాంటిది.. నేను తనని ఎప్పుడు అక్క అనే పిలుస్తుంటాను. మా మధ్య ఇలాంటి నీచమైన సంబంధాలు పెట్టడం కరెక్ట్ కాదు అంటూ.. గతంలో ప్రీతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా ఈ ప్రీతం జుకాల్కర్ చిరంజీవి కుమార్తె శ్రీజ కి కూడా స్టైలిస్ట్.. ఆమెతో కూడా ఎంతో క్లోజ్ గా ఉండేవాడో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు సోషల్ మీడియాలో చాలా చూశారు. అలా శ్రీజ తో కూడా ప్రీతం క్లోజ్ గా ఉండడం కళ్యాణ్ దేవ్ కూడా నచ్చేది కాదట..
అందుకే వీళ్లిద్దరి మధ్య కూడా విభేదాలు ఏర్పడి విడిపోయాడు అన్న వార్త ఇండస్ట్రీలో లేటెస్ట్ గా మనకు వినిపిస్తుంది. అలా వీళ్ళ ఇద్దరి కుటుంబాలలోని పచ్చని సంసారాలలో కొంపలో కుంపటి రగిలించాడని కేవలం ఆ హెయిర్ స్టైలిస్ట్ వల్లనే సమంత మరియు శ్రీజ (Sam and Sreeja) వాళ్ళ భర్తలతో విడిపోవాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారమే చెలరేగుతుంది. అయితే ఒక అమ్మాయి అబ్బాయి అంత క్లోజ్ గా ఉన్నంత మాత్రాన వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనుకోవడం, ఏదో నడుస్తుంది అనుకోవడం చాలా పెద్ద అవివేకం.. అది ఈ రోజుల్లో కూడా జనాలు మరి ఇంతలా ఆలోచిస్తున్నారా.? అంటూ నెట్టింట తెగ కామెంట్ల వర్షం కురుస్తుంది.