Home Cinema BRO : బ్రో సినిమా రిజల్ట్ పై మెగా హీరో సంచలన వ్యాఖ్యలు.. హిట్టా ఫట్టా..

BRO : బ్రో సినిమా రిజల్ట్ పై మెగా హీరో సంచలన వ్యాఖ్యలు.. హిట్టా ఫట్టా..

sai-dharam-tej-comments-on-the-bro-movie-result-in-a-press-meet

BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మెగా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూడటం జరిగింది. ఈ సినిమా టికెట్స్ రేటు పెంచకుండా ఉన్న రేట్లు తోనే సినిమా రిలీజ్ చేశారు. అలాగే టికెట్ బుకింగ్ కూడా ఒక రోజు ముందు (  comments on the BRO movie result ) స్టార్ట్ చేస్తే టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయి గాని కొంచెం స్లోగా అయ్యాయి. ఏదేమైనా సినిమా రిజల్ట్ ఎలా ఉంది అనేది ముఖ్యం. సినిమా చూసిన తర్వాత రివ్యూస్ పరంగా చూస్తే.. కొన్ని సూపర్ హిట్ అని, పవన్ కళ్యాణ్ అభిమానులకి పండగ అని అనగా.. మరికొన్ని రివ్యూస్ మిక్స్డ్ టాక్ తో వచ్చాయి.

sai-dharam-tej-comments-on-the-bro-movie-result-in-a-press-meet

ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ అయితే మాత్రం అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఆయన కుర్ర హీరోల కంటే స్టైలిష్ గా ఆయన నటన, మాట తీరు, కంటి చూపు, చిరునవ్వు అన్ని కూడా అభిమానులను చాలా ఆకట్టుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ (  comments on the BRO movie result ) పాత సినిమాల్లో పాటలను ప్రతి సీన్లో పెట్టడం మూవీ మేకర్స్ తెలివితేటలని అనుకోవాలి. అదే సినిమాని చాలా వరకు కాపాడింది ఎందుకంటే.. సినిమా చాలా స్లోగా వెళ్లే కథ వలన.. ఎక్కడ కూడా ఎవరికీ జోష్ లేని క్రమంలో.. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కథని కాపాడుకుంటూ.. ఎవరికి బోర్ కొట్టకుండా జోష్ వచ్చేలాగా ఈ పాటలతో నడిపించుకుంటూ వచ్చినట్టే అనిపించింది.

See also  Allu Arjun-Vijay Devarakonda : అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల మధ్య అలాంటి కామన్ కనెక్షన్ ఉందా?

sai-dharam-tej-comments-on-the-bro-movie-result-in-a-press-meet

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పాటలు వస్తున్నాయో.. పవన్ అభిమానులు థియేటర్లో విజిల్స్ వేసుకుంటూ, అరుస్తూ ఉండడంతో కొంత సామాన్య ప్రేక్షకుడికే ఉపసపదంగా అనిపించి ఉండవచ్చు. ఇది ఎలా ఉంటే బ్రో చిత్ర బృందం వాళ్ళు సినిమా సూపర్ హిట్ అని వాళ్ళు మీటింగ్లు కూడా పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే.. ప్రెస్ మీడియా (  comments on the BRO movie result ) వాళ్ళు మాత్రం దర్శకుడు సముద్రఖని ని సూటిగా ప్రశ్నించారు. ఈ సినిమా తమిళ్లో మీరే నటించినా కూడా తెలుగులో మీరు దర్శకత్వం చేసిన కూడా ఎందుకని మిక్స్డ్ టాక్ వచ్చింది? అక్కడ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే.. ఇక్కడ ఎందుకు మిక్స్డ్ టాక్ వచ్చింది అని అడిగారు. దానికి సముద్రఖని కొంత ఆవేశంగా ఎక్కడ మిక్స్డ్ టాక్ వచ్చింది. నేను సినిమా పబ్లిక్ తో కలిసి చూసాను. నాకు స్క్రీన్ అసలు సరిగ్గా కనిపించలేదు.

See also  Rashmika: ఏంటి ఆ దర్శకుడు రశ్మిక ఆ పార్ట్ ని అలా చూపించడం కోసం 30 లక్షలు ఖర్చు చేసాడా.?

sai-dharam-tej-comments-on-the-bro-movie-result-in-a-press-meet

పబ్లిక్ నిలబడి విజల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. సినిమా చూశాను అని చెప్పారు. ఇక సముద్రఖని ఇచ్చిన సమాధానం పక్కన పెడితే.. ఆ ప్రశ్న అడగ్గానే.. సాయిధరమ్ తేజ్ కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే సాయి ధరంతేజ్ మిక్స్డ్ టాక్ ఎక్కడ వచ్చిందండి? మిక్సీ టాక్ అనేది లేనేలేదు ఈ రోజుల్లో.. అయితే హిట్టు లేదా ఫ్లాపు.. అంతే తప్ప మిక్స్డ్ టాక్ అనేది ఉండదు. ఎక్కడ కూడా మిక్స్ టాక్ రాలేదు అని కొంచెం గట్టిగానే ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ప్రెస్ వాళ్లతో ఇలా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్రఖని ని ప్రశ్నిస్తే.. సాయి ధరమ్ తేజ్ ఎందుకు అంత హీట్ ఎక్కాడు అని కొందరు అంటే.. తన సినిమా కాబట్టి తన సమాధానం చెప్పుకున్నాడు అని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా సినిమా ఎలా ఉంది అనేది పూర్తిగా చెప్పాల్సింది ప్రేక్షకులు మాత్రమే..