Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే ప్రాధాన్యత గురించి, ఆయన సృష్టించిన రికార్డ్స్ గురించి మనందరికీ తెలిసిందే. అప్పట్లో డాన్స్, ఫైట్స్ ఈ రెండిటికీ చాలా ప్రాముఖ్యత ఉందని.. ఈ రెండిటితో కూడా సినిమాను 100 రోజుల పైన ఆడించొచ్చని నిరూపించంది మెగాస్టార్ చిరంజీవినే. అప్పట్లో చిరంజీవి సినిమాలో కచ్చితంగా డాన్స్, ఫైట్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు తీశావారు. అలాగే అప్పట్లో ( Chiranjeevi and Sumalatha ) ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి పెద్ద వయసు ఉన్న హీరోల నడుమ.. అప్పుడప్పుడే వస్తున్న యంగ్ హీరోగా చిరంజీవి అంటే కుర్రాళ్ళకి చాలా క్రేజ్ ఉండేది. ఆయన హీరోయిన్స్ తో చిందులు వేస్తుంటే.. కుర్రాళ్ళు థియేటర్లో గెంతులు వేసేవారు.
అప్పట్లో చిరంజీవితో రాధ, రాధిక, సుమలత, విజయశాంతి ఇంకా ఎందరో హీరోయిన్స్ జంటగా నటించారు. చిరంజీవితో నటించిన హీరోయిన్స్ ఆయనతో చాలా క్లోజ్ గా ఉండేవారు. సాధారణంగా సినిమా రంగంలో ఒక హీరో హీరోయిన్ కొంచెం క్లోజ్ గా ఉంటే.. వెంటనే వాళ్ళపై అనేక రూమర్స్ వచ్చేస్తుంటాయి. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారని, వీళ్ళు ఇద్దరు ( Chiranjeevi and Sumalatha )పెళ్లి చేసుకోబోతున్నారని ఇలా ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. అందులోనూ ఇప్పటి జనరేషన్లో అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి భయంకరంగా తయారైంది పాపం. ఉన్నది లేనిది కూడా వాళ్ళ అప్డేట్స్ వెంటనే తెలుసుకొని ఎవరు ఊహించింది వాళ్ళు వెంటనే అప్డేట్ చేసుకుంటున్నారు.
అయితే అప్పట్లో సోషల్ మీడియా లేనప్పటికీ చిరంజీవి పై ఒక వార్త మాత్రం తెగ ప్రచారం అయ్యింది. చిరంజీవికి సుమలతకి మధ్య ఏదో అఫైర్ ఉందని, వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని, బహుశా చిరు ఆమెను రెండో పెళ్లి కూడా చేసుకోవచ్చేమో అని అనేక వార్తలు అప్పట్లో వచ్చాయి. చిరంజీవి చిన్న వయసులోనే అల్లు రామలింగయ్య కూతురైన సురేఖని పెళ్లి చేసుకోవడం జరిగింది. చిరంజీవి సినిమా రంగాన్ని తన కెరియర్ ( Chiranjeevi and Sumalatha ) కోసం ప్రొఫెషనల్ గా చూసుకునే వారు తప్ప అందులోకి పర్సనల్ లైఫ్ ని దూర్చుకోవడం అనేది ఆయన ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే చిరంజీవి కుటుంబం పెద్దది పైగా ఆయనే పెద్ద కొడుకు. కాబట్టి కుటుంబాన్ని పట్టించుకోవడం అలాగే భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఆయన ప్రధమ లక్ష్యంగా ఉండేది.
అలాంటి ఆయన మీద సుమలత విషయంలో అనేక నిందలు వస్తూ ప్రచారాలు జరగడంతో.. ఆ వార్త సురేఖ చెవి వరకు వెళ్ళిందంట. దీనితో సురేఖ బాధని కొంచెం కూడా చూడలేని చిరంజీవి.. వెంటనే మీడియా వాళ్లకి చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని.. లేనిపోని మాటలను సృష్టించకూడదని కూడా మీడియాకు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. సుమలత కూడా మీడియా వాళ్లకు.. ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పిందంట. అక్కడితో ఆ వార్త సద్దుమణిగిపోయింది కానీ.. అప్పటినుంచి చిరంజీవి సుమలతతో కలిసి సినిమాలు కూడా నటించలేదంట. అయితే సుమలత భర్త అంబరీష్ చిరంజీవికి మంచి స్నేహితుడు అంట. ఆ తర్వాత దురదృష్టవశాత్తు అంబరీష్ కొంతకాలానికి మరణించడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి సురేఖ ఇద్దరు కూడా సుమలతని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారంట.