Copper Bottle: ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ అవగాహన రోజు రోజుకి పెరుగుతుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అందుకోవడంతో అందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని ఇంకా బాగా మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలో అనేక విధాలుగా తెలుసుకుని.. వాటిని ఫాలో అవుతున్నారు. జనాభా పెరిగిపోయి పొల్యూషన్ తో అనారోగ్య పాలవుతున్న మాట వాస్తవమే గాని, ఆరోగ్యపరంగా కొన్ని టిప్స్ ని తెలుసుకోవడంలో ( Rules for using Copper Bottle for drinking water ) మాత్రం ముందుకు దూసుకు వెళ్తున్నారని మాత్రం చెప్పవచ్చు. ఒకవైపు ఆధ్యాత్మికంగా మరోవైపు ఆరోగ్యపరంగా కూడా అందరూ అవగాహన పెంచుకోవడానికి ఉర్రూతలూగుతున్నారు. రాగి అనేది ఒక లోహం ఈ లోహం. ఇప్పుడు చాలా ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా త్రాగే నీతిని రాగి బాటిల్స్ తో తాగడం అలవాటు చేసుకుంటున్నారు.
రాగి బాటిల్స్, రాగి గ్రాస్ లు సెట్ గా కొనుక్కొని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. ఇక ఆఫీసుల్లో కూడా రాగి బాటిల్స్ పెట్టుకొని వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ బాటిల్స్ తో నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, రక్తపోటు నియంత్రణ అవుతుందని, చర్మం అందంగా మెరుస్తుందని, రక్తహీనత నివారణ కూడా అవుతుందని.. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది రాగి బాటిల్స్ తో నీరు తాగడానికి ఇష్టపడుతున్నారు. దీనివలన ( Rules for using Copper Bottle for drinking water ) మార్కెట్లో రాగి బాటిల్స్ వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది. ఎక్కడ చూసినా రాగి బాటిల్స్, రాగి గ్లాసులు సెట్ లో విపరీతంగా అమ్ముతున్నారు. అయితే రాగి బాటిల్లో నీళ్లు తాగేటప్పుడు కొన్ని నియమాల్ని పాటించకపోతే అనారోగ్య పాలయ్యే అవకాశం కూడా ఉందని.. అది చాలా ముప్పు తెచ్చి పెడుతుందని అంటున్నారు కొందరు నిపుణులు.
రాగి బాటిల్స్ లో నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రం నిలువున్న నీళ్లు మాత్రమే తాగాలంట. లేదు పొద్దున్న ఒక్కసారి ఒక గ్లాస్ మాత్రమే తాగుతాం అనుకుంటే 12 గంటలు నిలువ ఉన్న పర్వాలేదు. అంతకంటే ఎక్కువ నిలువ ఉన్న నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదంట. అలాగే కల్తీ రాగి బాటిల్స్ కొనుక్కుని, తక్కువకు వస్తున్నాయని కొనుక్కుంటే.. వాటిలో ఏవేవో కలిపి లోహాలను తయారు చేస్తే.. అలాంటి బాటిల్స్ లో నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదంట. అలాగే కొన్ని రాగి బాటిల్స్ లోపల అసలు రాగిణి పెట్టకుండా, ఏదో లోహంతో తయారు చేస్తుంటే.. వాటిలో ( Rules for using Copper Bottle for drinking water ) నీళ్లు తాగడం కూడా ప్రమాదకరమేనట. మరోపక్క రాగి బాటిల్స్ ని సరిగ్గా ప్రతి రోజు క్లీన్ చేసుకుని వాడకపోతే దాని వలన కూడా ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. రాగి బాటిల్ ని బ్రష్ తో ప్రతిరోజు శుభ్రంగా లోపల క్లీన్ చేసుకుని.. అప్పుడు నీళ్లు ఫ్రెష్ గా పట్టుకొని వాడుకోవాలి. ఇలా కొన్ని నియమాలను పాటించకుండా ఇష్టానుసారం రాగి బాటిల్ వాడినా కూడా ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతుందని అంటున్నారు. అందుకని ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు రాగి బాటిల్ ని వాడాలి గాని.. ఈ నియమాలను తప్పకుండా పాటించాలి..