RGV Vyooham : అత్యంత వివాదస్పద దర్శకుడు RGV మొదలు పెట్టిన సినిమా వ్యూహం. ఈ సినిమాని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి అనుకూలంగా , ఆయన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీస్తున్నారని ( RGV Vyooham movie targets ) బహిరంగంగానే ఆయనే చెప్పారు. అయితే ఈ సినిమాని రెండు పార్ట్లుగా తీస్తున్నారు. మొదటి పార్ట్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణశ్వీకరాం వరకు ఉంటుందని హింట్ ఇచ్చారు. దానికి తగినట్టే జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకార దృశ్యాలు చిత్రీకరించే వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు టీజర్లు ద్వారా , పలు ఇంటర్వ్యూస్ ద్వారా , పోస్టర్స్ ద్వారా RGV పాయింట్ అఫ్ వ్యూ లో..
రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉంటూ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల నుండి – జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం వరకు జరిగిన రాజకీయ పరిస్థితులని తనదైన శైలిలో చూపించపోతున్నాడు. ఇక్కడ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే.. అందరూ ( RGV Vyooham movie targets ) అనుకుంటున్నట్టు ఈ వ్యూహంలో జగన్ మోహన్ రెడ్డి ని హైలెట్ చేయడం , తన ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రబాబు గారిని టార్గెట్ చేసి విలన్ కింద చూపుతారని మెజార్టీ ప్రజలు అనుకున్నారు. కానీ కొన్ని లీక్ వార్తలను బట్టి.. ఈ సినిమాలో నిజమైన విలన్ చంద్రబాబు కాదు, RGV టార్గెట్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదే పెట్టాడు.
2014 ఎన్నికల ముందు జరిగిన పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ ని, సోనియా గాంధీని టార్గెట్ చేస్తే, 2014 ఎన్నికల తరువాత జరిగిన సంఘటనలకు ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ కాబోతున్నాడని , జగన్ రాజకీయ లైఫ్ లో చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ అసలైన విలన్ అని ఈ సినిమా ద్వారా చూపే ప్రయత్నం చేస్తున్నాడంట RGV. 2014 ఎన్నికల్లో ( RGV Vyooham movie targets ) పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతుతో CM అయిన చంద్రబాబు నాయుడు అనేక హామీల విషయంలో ప్రజలు కొంత వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పసిగట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని రంగంలోకి ఎలా దించాడు , తనకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్లని తన ప్రాధాన ప్రత్యర్థి అయిన జగన్ కి ఓటు వేయకుండా పవన్ కళ్యాణ్ ని ఎలా వాడుకున్నాడు.
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇష్యూ జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏమి మాట్లాడుకున్నారు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చి చంద్రబాబు మళ్ళీ ముఖ్యంమంత్రి అవడం కోసం ఎలా కృషిచేశాడో తనదైన శైలిలో తెరపై చూపించబోతున్నాడు అంట. అదే సమయంలో చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ కి అస్సలు ప్రేమ నమ్మకం లేవని, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు కి విపరీతమైన చులకన భావం అని చూపబోతున్నాడు అంట! చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కి పడదు, పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు కి పడదు.. మరి వీరు ఇద్దరూ ఎందుకు ఒకటి అయ్యినట్టు ? చంద్రాబుకి జగన్ ఎలాగో రాజకీయ ప్రత్యర్థి కాబట్టీ జగన్ ని చంద్రబాబు టార్గెట్ చేయడంలో అర్ధం ఉంది. జగన్ ని చంద్రబాబు , చంద్రబాబు ని జగన్ టార్గెట్ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే.. మరి పవన్ కళ్యాణ్ జగన్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక వున్న అంతర్గత మేటర్ ని కూడా RGV తన వ్యూహంలో చాల క్లియర్ గా బహిర్గతం చేస్తున్నాడు అంట.