మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీఎం అయిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ 2 నెలల ముందు వరకు 20 సీట్లు వస్తే గొప్ప అనే పరిస్థితి ఉంది కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని తన బుజాల మీద వేసుకొని కస్టపడి గెలిపించుకున్నారు. బీజేపీ బిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయి అనే వేవ్ కూడా బాగా వినిపించటంతో జనాలు కూడా కాంగ్రెస్ వేపే ముక్కు చూపారు. కాంగ్రెస్ గెలవటానికి మరో కారణం వారి 6 గారెంటీలు.
గెలిచిన వెంటనే మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ చేసి ఒక హామీ నెరవేర్చారు సీఎం రేవంత్. ఇప్పుడు మరో రెండు హామీలు కూడా అమలు చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు హామీలు ఏంటి అంటే 500 లకే గ్యాస్ సిలిండర్ మరి రెండోది 200 యూనిట్ల ఫ్రీ కరెంటు. ప్రస్తుతం పెరిగిన గ్యాస్ రేట్లు రానున్న ఎండాకాలం వల్ల ఈ రెండు హామీలు ప్రేజలకు చాల ఉపయోగపడతాయి. ఫ్రీ విద్యుత్ మాత్రం కేవలం 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్న వారికి మాత్రమే.