Dhanush : హీరో ధనుష్ పేరు వినగానే తమిళంలో ఎంత క్రేజ్ ఉంటుందో ఇంచుమించుగా తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ధనుష్ హీరోగా తన ప్రతిభను అన్ని భాషల్లోనూ గట్టిగానే ( Rayan movie as Dhanush director ) చూపించుకున్నాడు. ముఖ్యంగా తెలుగు వాళ్లకు ధనుష్ సినిమా తమిళ్లో రిలీజ్ అయితే అది కచ్చితంగా తెలుగులో డబ్బింగ్ చేసి చూసే అలవాటు ఏర్పడింది. ధనుర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో అభిమానంగా ఆదరిస్తారు కనుక ప్రతి సినిమాని తెలుగులోకి డబ్ చేయడం జరుగుతుంది.
అలాగే ధనుష్ హీరోగా నటించిన రాయన్ సినిమా జూలై 26వ తేదీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి ధనుష్ అభిమానులు, సినీ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదుర చూశారు. ఎందుకంటే.. ఈ సినిమాలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమా ధనుష్ కెరియర్ లో 50వ సినిమా కావడం ఒక ప్రత్యేకత. అలాగే ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. ఈ సినిమాకి ధనుష్ దర్శకుడిగా కూడా చేశాడు.
ఇంతవరకు హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధనుష్ పై అభిమానులకు ఎంతో నమ్మకం ఉంది. అలాంటిది ఇప్పుడు తమ హీరో దర్శకుడుగా కూడా చేయడం వాళ్లకు ఎనలేని ఆనందాన్ని కలిగించింది. కానీ దర్శకుడుగా ధనుష్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు? ఎలా తీశాడు? అనేది అందరిలోనీ ఒక రకమైన ( Rayan movie as Dhanush director ) కుతూహలం లేదనిమాత్రం చెప్పలేము. యితే రాయన్ సినిమాపై ట్విట్టర్లో అనేకమంది రివ్యూ ఇస్తున్నారు. ఆ రివ్యూలను బట్టి చూస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం.
ఒక ప్రాంతంలో ఆధిపత్యం పై పోరాడే హీరో హీరోయిన్స్ అందరూ ఏకమై అతని మీద చేసే పోరాటం, అలాగే వాళ్లతో పోరాడి తనను నమ్ముకున్న వాళ్ళకి హీరో చేసే న్యాయమే ఈ సినిమా అంట. కథ చూస్తే చాలా పాతగానే ఉంది. కథలో ఏ కొత్తదనం లేదు. ఇది ఎప్పటిలాగే ఎప్పటినుంచో వస్తున్న కథ మాత్రమే కానీ.. సినిమాలో ధనుష్ ( Rayan movie as Dhanush director ) గుండుతో డీ గ్లామర్ గా నటించి.. అందర్నీ ఆకట్టుకున్నాడని అంటున్నారు. ధనుష్ ఒక నటుడిగా ఎంత ఆకట్టుకుంటాడనేది అందరికీ తెలిసిందే. ఇక దర్శకుడిగా ఎలా చేశాడో, ఒక పాత స్టోరీ తో ఆడియన్స్ ని కొత్తగా ఎలా అలరించాడు అనేది ప్రశ్న.
ధనుష్ దర్శకుడిగా కూడా చాలా బాగా చేశాడని, కథ పాతదే అయినా కూడా కొత్తదనంగా, ఇంట్రెస్టింగ్ గా చూపించాడని.. ఫస్ట్ ఆఫ్ బాగానే ఉందని, ఇంటర్వెల్ బ్యాంక్ అద్భుతంగా ఉంటుందని, సెకండ్ హాఫ్ కి కావాల్సిన స్టఫ్ సినిమాలో ఉందని అనేకమంది ట్విట్టర్లో రివ్యూలు ఇవ్వడం జరిగింది. అయితే ట్విట్టర్ రివ్యూలను పక్కన పెడితే.. అసలు సినిమా ఎలా ఉంది? ధనుష్ హీరోగా తన దర్శకత్వంలో తాను ఎలా నటించాడు? అనేది తెలియాలంటే స్వయంగా సినిమాకి వెళ్లి చూస్తేనే మన ఆసక్తి తీరుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే..