పోరగాళ్ళకు మతి పోగోడుతున్న కేరళ కుట్టి – ఎరుపు అందాలతో మైమరుపు
అనుపమ పరమేశ్వరన్ 1996 ఫిబ్రవరి 18న పరమేశ్వరన్ ఎరక్కత్ & సునీత పరమేశ్వరన్ లకు కేరళలోని త్రిసూర్ జిల్లాలోని ఇరింజలకుడలోని మలయాళీ కుటుంబంలో పుట్టింది. అనుపమకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వాడి పేరు అక్షయ్. CMS కాలేజ్ కొట్టాయంలో చేరింది తన విద్యాబ్యాసం కొరకు కానీ నటనపై మక్కువతో కళాశాలలో కమ్యునికేట్ ఇంగ్లీష్ లో పట్టా పొందింది. మొదటి సారి మళయాలం సినిమా ప్రేమమ్ లో నటించిన ఆ అమ్మడు బంపర్ హిట్టు కొట్టడంతో తెలుగులో మళ్ళీ తననే పెట్టి తీయడం తనకు ఎదురులేకుండా తన నటను మంచి స్పూర్తి లభించింది.
ఇక ఆ తర్వాత మళయాలంలో ఓ అథిది పాత్రలో తాను నటించింది, తర్వాత తెలుగులో అఆ లో ప్రముఖ పాత్ర పోషించింది. తర్వాత తమిళ చిత్రంలో దనుష్ సరసన నటించి ప్రధాన పాత్ర పోషించింది తర్వాత తెలుగులో శతమానంభవతి తో పెద్ద హిట్టు అందుకుంది, ఆ తరువాత ఇటు తెలుగులో అటు మళయాలంలో వరుస సినిమాల్లో మస్త్ అంటే మస్తు బిజీ బిజీగా అయిపోయింది ఈ కేరళా కుట్టి. ఓ వైపు వెండి తెరపై మెరుస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లు, షార్మ్ ఫిల్మ్ లు చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంది.
ఇక 2022 ఐతే అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి, కార్తికేయ -2 వంద కోట్ల క్లబ్బులో చేరడం ఆ తర్వాత 18 పేజేస్ తో మంచి హిట్ కొట్టడం, ఓటీటీలో రిలీజైన బట్టర్ ప్లై మంచి రెస్పాన్స్ రావడం తనకు అచ్చొచ్చిన ఇయర్ అనే చెప్పాలి ఆ సంవత్సరం మరి ఈ సంవత్సరం 2023 ఎలా వస్తుందో చూడాలి.
ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ ముందుంటుంది నిత్యం తన ప్రతీ భావాన్ని అందులో షేర్ చేస్తుంది అలా ఈ పండుగకు రెడ్ డ్రస్సులో మంచి కనువిందు చేసింది ఈ కుట్టి. కళ్ళకి నల్లని కాటుక పెట్టి, తన పెద్ద పెద్ద కలువల్లాంటి కళ్ళతో, మైమరిపించే ముఖ సౌందర్యంతో, నవ్వుల నయగారాలు నడుము వయ్యారాలు ఇలా చెప్పుకుంటూ పోతే నేను కవి కాలిదాసు అయిపోతానేమో ఆమే మత్తులో అంత అందం ఆమె సొంతం. ఎవరు చేసుకుంటాడో ఈ అనుపమను ఎక్కడ ఉన్నాడో ఆ అందగాడు చూడాలి మరి.!