Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్. మొదటి సినిమా ధడక్ తో మంచి హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత ఎదురులేకుండా బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నప్పటికీ హిట్లు మాత్రం పెద్దగా దొరకలేదు, అయినప్పటికీ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది కానీ ఫలితం మాత్రం అదృష్టం రూపంలో దక్కడం లేదు.. దీంతో మరి ఏం ఆలోచించుకుందో ఈ బ్యూటీ (Janhvi Kapoor Career) సౌత్లోకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాలనుకుంది.. దివంగత అందాల తార శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ తో నటించినట్లుగానే..
సౌత్ లో ఈ అమ్మడు మరేవ్వరితో నటించకుండ తన మొదటి సినిమా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తో షేర్ చేసుకునే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం పనులు ఇప్పటికే మొదలవ్వగా ఈ అమ్మడు షూటింగ్లో పాల్గొంది. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ కెమెరాలకు ఫోజులిస్తుంది. ఇంకేముంది ఆ ఫోటోలు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఇక ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ గురించి మరో వార్త కొడైకొస్తుంది.. అదేంటంటే తాజాగా తన ప్రియుడు శిఖర్ తో కలిసి తిరుమలలో ప్రత్యక్షమైంది. తన ప్రియుడితో ప్రత్యేక పూజలు చేసింది.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. జాన్వి తండ్రి బోని కపూర్ వీళ్లిద్దరి ప్రేమను అంగీకరించాడని, మరోవైపు శిఖర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కారణంతోనే వీళ్లిద్దరూ తిరుమలకు వచ్చారని వార్తలు వ్యాపించాయి. ఇక ఇది కాక మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్.. జాన్వి శేఖర్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల పట్ల జాహ్నవి అభిమానులు ఎంతో ఆందోళనలో పడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అవుతున్న ఇంతవరకు కెరియర్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేదు. ఇక పెళ్లి చేసుకుంటే జాన్విని పట్టించుకునే నాధుడే ఉండడు అంటూ అభిమానులు లబోదిబోమంటున్నారు..
ఇక ఈ విషయం తెలిసి జాన్వి (Janhvi Kapoor Career) కూడా పెళ్లి చేసుకున్నట్లయితే అంతకుమించి ఆమె చేసిన మరొక పెద్ద తప్పు లేదంటున్నారు. అసలే బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ అమ్మనుడిని ప్రస్తుతం పట్టించుకోవడమే లేదు.. ఇక పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా పట్టించుకునే నాధుడే లేడంటూ నేటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ మోత మోగిపోతుంది. మరి దీనికి జాన్వి ఏమంటుందో వేచి చూడాలి.? ప్రస్తుతం అయితే రెగ్యులర్ గా ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న జాన్వి ఈ మూవీతో తన దశ తిరిగిపోతుంది. ఎన్టీఆర్ ౩౦ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా మారాలని అభిమానులు కోరుతున్తున్నారు. మరి చిత్రం పేరు ఏమనుకున్నారో ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాలి.