Rashmika Mandanna: తెలుగు చిత్ర పరిశ్రమలో ఛలో సినిమా ద్వారా తన సత్తా చాటుకున్న రష్మిక మందన ఆ తర్వాత వరుస చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగి పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటిస్తోంది. అలా అతి తక్కువ సినిమాల్లో నటింసినప్పటికీ నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్నది ఈ కన్నడ బ్యూటీ.. మాతృభాష కన్నడైనప్పటికీ తెలుగులో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన ముద్ర వేసుకుంది..
ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన పుష్ప సినిమా తర్వాత రష్మిక ఇమేజ్ డబుల్ కాదు త్రిబుల్ అయింది. ఆ సినిమా అల్ ఓవర్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రష్మికకు ఇటు సౌత్ లోనే గాక అటు నాట్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. ఫట్లు – హిట్లతో సంబంధం లేకుండా ప్రస్తుతం అటు నార్త్ లోను ఇటు సౌత్ లోనూ దున్నేస్తుంది ఈ భామ. ఇదే క్రమంలో భారీగా తన ఆస్తులను కూడా కూడబెట్టుకుందని సమాచారం.
ఐదు ప్రధాన నగరాల్లో ఐదు లగ్జరీ అపార్ట్మెంట్లను కొన్నట్టు రీసెంట్ గా ఒక వార్త చెక్కర్లు కొట్టింది. కానీ ఈ విషయాన్ని సున్నితంగా తోసిపుచ్చింది రష్మిక. అయితే రష్మిక ఐదు అపార్ట్మెంట్స్ కొన్నదో లేదో పక్కన పెడితే… రెండు చేతుల నిండా మాత్రం ఈ కన్నడ బ్యూటీ గట్టిగానే సంపాదిస్తుంది. ఇంతకు మరి రష్మి ఒక నెలకి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మీ కళ్ళు తిరగడం ఖాయం..
రష్మిక ఒక్క సినిమాకి 4-5 కోట్ల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అంతేకాక పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉంటూ బ్రాండ్ ప్రమోషన్స్ కు గట్టిగా చార్జ్ చేస్తుంది. ఇలా ఒక్క నెలకు రష్మిక 1.5-2 కోట్ల వరకు సంపాదిస్తుందట.. ఈ లెక్కన రష్మిక ఏడాది సంపాదన 20 కోట్లకు పై మాట ఉంటుందని కాగా సినిమాల విషయానికొస్తే హిందీలో రన్బీర్ కపూర్ కు జోడిగా యానిమల్ తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప2 సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం.