Animal : ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఎంత సక్సెస్ను సాధిస్తాయో.. అంత క్రేజ్ ని, అంత ట్రెండ్ ని, అలాగే అంత విమర్శలను కూడా సాధిస్తాయి. అలాంటి కోవలోకి వచ్చిన సినిమా అనిమల్. రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న( comments on Animal movie in Rajya Sabha ) హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా అనిమల్. ఈ సినిమా రిలీజ్ అయ్యి అతి కొద్ది రోజుల్లోనే కొన్ని కోట్ల కలెక్షన్లు రాబడుతుంది. ఎవరి నోట విన్నా ఈ సినిమా సూపర్ అంటున్నారు. దానితోపాటు విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ కూడా కొందరు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కామెంట్స్ ఇక్కడితో ఆగలేదు, ఏకంగా రాజ్యసభ వరకు చేరింది.
రాజ్యసభలో మ్యాటర్స్ రైజ్ చేసే సమయంలో రాజ్యసభ మెంబర్ రంజిత్ రంజాన్.. అనిమల్ సినిమాపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలు యువత మీద ఎలాంటి రిజల్ట్ చూపిస్తుంది అనే దానిపై ( comments on Animal movie in Rajya Sabha ) ఆమె మాట్లాడారు. కొన్ని సినిమాలకి భారత ప్రభుత్వం సెన్సార్ బోర్డు ఎలా సర్టిఫికెట్ ఇస్తున్నారు? ఎలా ఒప్పుకుంటున్నారు అని ప్రశ్నించారు. ముఖ్యంగా అనిమల్ సినిమా లో విపరీతమైన వైలెన్స్, ఆడవాళ్ళని కించపరిచేలా చూపించడం ఇవన్నీ కూడా సెన్సార్ ఒప్పుకోకూడదని.. అంతేకాకుండా ఈ సినిమా చూసి ఏం నేర్చుకుంటారు అనే ప్రశ్నించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి సినిమా చూడడానికి ఎంత అభ్యన్తకరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో అంత నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న ఒక రోల్ ని హీరోగా చేసి దాన్ని హీరోయిజంగా చూపించడం ఎంత వరకు న్యాయమని అడిగారు. తండ్రి మీద ప్రేమ ఉంటే మాత్రం మారణాయుధాలు ( comments on Animal movie in Rajya Sabha ) పట్టుకొని స్కూల్ కి, కాలేజీలకి, ఎక్కడబడితే అక్కడకి వెళ్ళిపోయి.. అందరిమీద దాన్ని ఉపయోగించడం అనేది.. అలాంటి క్యారెక్టర్ ని చూపించి అది హీరోయిజమని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. అలాగే తండ్రి మీద ప్రేమతో ఇక రక్తసంబంధం గానీ, ఏదీ చూసుకోకుండా ఎవరినైనా ఏదైనా చేసేసేలాగా హింసాత్మకంగా చూపించిన ఈ సినిమా గురించి ఆలోచించాలని చెప్పారు.
ఇలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనిపై ఇప్పటికే సామాజిక ప్రజల నుంచి వస్తున్న కామెంట్స్ ఎలా ఉన్నాయంటే.. సినిమాలో ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉంది. క్యారెక్టర్ లో అందరూ లీనమయ్యారు చాలా బాగా చేశారు. కానీ.. సినిమా మెసేజ్ అయితే బాలేదని చాలామంది అంటున్నారు. అది చిలికి చిలికి గాలి వానై సామాన్యల నోట నుంచి చివరికి రాజ్యసభలో రాజ్యసభ మెంబర్స్ చర్చించాల్సిన స్థితికి వచ్చింది. మరి దీనిపై.. ఇలాంటి సినిమాని కథ రాసుకున్న సందీప్ రెడ్డి వంగగాని, అందులో నటించడానికి ఒప్పుకున్నా హీరో , హీరోయిన్స్.. ఇతర పాత్రలలో నటించిన నటులు గాని ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. దానికి తోడు ఇక సామాన్యులు, ఆడియన్స్,ఫాన్స్ ఈ పాయింట్స్ పై ఏమంటారో, ఎలాంటి కామెంట్స్ చేస్తారో ముందు ముందు చూడాలి.