
Amitabh Bachchan : ఈరోజుల్లో సినిమా గానీ, వెబ్ సిరీస్ గాని, ఏం చూడాలన్నా.. పక్కన ఏ వయసు వాళ్ళు ఉన్నారు? మన పిల్లలతో చూడొచ్చా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే.. మన నాగరికత ( kiss scene with Amitabh Bachchan ) విదేశాలకు దగ్గరగా వెళ్తుంది. అలాగని మన స్వదేశీ నాగరికతను పూర్తిగా వదలలేక పోతుంది. వయసు తేడా ఉన్నవాళ్లు మన పాత నాగరికతలో ఉంటుంటే.. ఇప్పటి జనరేషన్ కొత్త దానికి ఎగబడుతుంటే రెండిటిని సర్దుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. సినిమాల్లో, వెబ్ సిరీస్ లో , లిప్ లాక్ సీన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అలాంటి సీన్లని పూర్వం సినిమాల్లో ఎక్కడా కూడా చూసేవాళ్లం కాదు.
ఇప్పుడు అవి చాలా సినిమాల్లో కామన్ అయిపోయాయి. పైగా ఇలాంటి సీన్లు ఎందుకు పెడుతున్నారు అని అడుగుతుంటే.. స్టార్స్ సైతం ఒకటే చెప్తున్నారు.. అందులో పెద్ద భూతేముంది? ఇద్దరి మధ్య ప్రేమని వ్యక్తపరచడంలో అదొక మంచి మార్గం అంతే అని అంటున్నారు. ఇటీవల హీరో నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆయన చెప్పిన ( kiss scene with Amitabh Bachchan ) మాట అదే. ఈ లిప్ లాక్ సీన్స్ గురించి నెటిజనులు తెగ మాట్లాడుకుంటున్నారు. ఏదైనా ఒక సినిమా బాగుంది అంటే అయితే అందులో అవి ఎక్కువగా ఉన్నాయా అని కొందరు, ఏమీ లేకుండా చాలా పీస్ ఫుల్ గా ఉందా? ఫ్యామిలీతో చూడొచ్చా అని మరికొందరు మాట్లాడుకోవాల్సిన స్థితి ఏర్పడింది.
ఇటీవల రిలీజైన అనిమల్ సినిమాలో ఇక ఇలాంటి సీన్స్ గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒక రకమైన విద్వాంసాన్ని చూపించాడు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సీన్స్ గురించి మాట్లాడుకుంటూ.. అసలు ఇలాంటి సీన్స్ జనరేషన్ ముందు హీరోలు ఎవరైనా చేశారా? లిప్ లాక్ సీన్స్ ఆ హీరోల సినిమాల్లో ఉండేవా అని ( kiss scene with Amitabh Bachchan ) మాట్లాడుకుంటూ.. అమితా ఒక స్టార్ హీరోయిన్ తో లిప్ లాక్ ఇచ్చిన సీన్ ని ఇప్పుడు మళ్లీ వెలుగులోకి తెస్తున్నారు. ఆ సీన్ చూసి.. ఆ సీన్ లో అమితాబ్ ఎందుకు లిప్ లాక్ చేయవలసి వచ్చింది అనే దానిమీద ఆ సినిమాని చూడని వారు చేస్తున్నారు. అంతేకాకుండా ఆ సినిమాలో హీరోయిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ లిప్ లాక్ టైం లో ఆమె ఎం చేసిందో చెప్పుకొచ్చింది.
అమితా.. బ్లాక్ అనే సినిమా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందరి హృదయాల్ని కదిలించేసింది. ఒక గుడ్డి అమ్మాయిని చిన్నప్పుడు నుంచి గైడెన్స్ ఇచ్చే కోచ్గా అమితాబ్ అందులో అద్భుతమైన రోల్ చేశాడు. అందులో ఆ గుడ్డి అమ్మాయి రాణి ముఖర్జీ. పెద్దదైన తర్వాత చిన్నప్పటినుంచి నాకు అన్ని నేర్పించింది మీరే. నాకు అన్ని చూపించింది మీరే. ఒక్కసారి కిస్ చేసి ఆ అనుభూతిని కూడా నాకు చూపించండి అని అడుగుతుంది. అప్పుడు అమితాబ్.. రాణి ముఖర్జీ అడిగిన కోరికను కాదనలేక ఆమెను కిస్ చేస్తాడు. ఆ క్షణంలో అమితాబ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత అమితాబ్.. రాణి ముఖర్జీ కి కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఆ విషయం రాణి ముఖర్జీ ఒకసారి ఇంటర్వ్యూలో చెబుతూ.. ఆయనని కిస్ చేయాలంటే నాకు చాలా భయం వేసింది. నేను రెండు మూడు సార్లు బ్రష్ చేసుకుని వెళ్లి.. అప్పుడు ఆ సీన్ చేశాను అని చెప్పింది. ఆ రోజుల్లో ఒక సినిమాలో ఇలాంటి సీన్స్ పెట్టాలంటే దర్శకుడు ఎంతో ఆలోచించేవారు. ఇప్పుడు ఇవన్నీ చాలా సామాన్యమైపోయాయి.