Home Cinema Roja – Ramya Krishna : ఇంటికొచ్చిన రమ్యకృష్ణ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రోజా.....

Roja – Ramya Krishna : ఇంటికొచ్చిన రమ్యకృష్ణ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన రోజా.. వీడియో వైరల్..

ramya-krishna-went-to-minister-roja-selvamani-house-video-became-viral

Roja – Ramya Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన రోజా, రమ్యకృష్ణ.. వీళ్ళిద్దరి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. రమ్యకృష్ణ 1985లోనే సినిమా రంగంలో అడుగు పెట్టడం జరిగింది. ఆమె అప్పట్లో అందరు స్టార్ హీరోలు సరసన నటించేసి, తనకంటూ విపరీతమైన ( Ramya Krishna went to Roja house ) క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక రమ్యకృష్ణ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన సినిమాని పిచ్చెక్కినట్టు చూసేవారు సినీ అభిమానులు. ఆమె ప్రతి హీరో సరసన నటించేటప్పుడు వాళ్లతో మంచి కెమిస్ట్రీని మెయింటైన్ చేసేది. రమ్యకృష్ణ సినిమా అంటే కుర్రాళ్ళు క్రేజీగా చూసేవారు. అలాగే రోజా 1991లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.

ramya-krishna-went-to-minister-roja-selvamani-house-video-became-viral

రోజా కూడా అప్పట్లో అందరి స్టార్ హీరోల సరసన ఇంచుమించుగా నటించేసింది. రోజా, రామకృష్ణ ఇద్దరు హీరోయిన్లు ఒకే టైంలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. వీళ్ళిద్దరి మధ్యన మంచి స్నేహం కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ముగ్గురు మొనగాళ్లు, సమ్మక్క సారక్క, అన్నమయ్య మొదలగు సినిమాల్లో ( Ramya Krishna went to Roja house ) నటించారు. కాలం గడిచే కొద్దీ ఎంతటి వారి మధ్యనైనా దూరం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే.. ఎవరి జీవిత విధానంలో వాళ్ళు బిజీ అయిపోతారు. రోజా సినిమా రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత.. ఆమె విపరీతమైన బిజీ అయిపోయింది. ఇక ఆమె నిరంతరం టీవీ షోస్ తో పాటు.. రాజకీయ పరంగా ఎప్పుడూ అభిమానులకు అందుబాటులోనే ఉంటూ మంచి ఫేమ్ తోనే నడుస్తుంది.

See also  భర్త చనిపోయిన మళ్లీ పెళ్లి చేసుకోని సినీ తారలు వీళ్ళే.

ramya-krishna-went-to-minister-roja-selvamani-house-video-became-viral

అలాగే రమ్యకృష్ణ తన పెళ్లి తర్వాత చాలా కాలం సినిమా రంగానికి దూరం అయిపోయి.. ఇటీవల కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇటీవల ఆమె నటించినా రంగమార్తాండ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని ప్రకాష్ రాజ్ సరసన ( Ramya Krishna went to Roja house ) నటించిన విధానం, ఆమె నటన ఇంకా ఆమెను తెలుగు సినీ అభిమానులు అభిమానించేలా చేసింది. అయితే రమ్యకృష్ణ తిరుమల దర్శనం చేసుకుని అక్కడి నుంచి నగరి లో ఉన్న రోజ ఇంటికి వెళ్లారు. రమ్యకృష్ణ ని చూసిన రోజా ఆనందంతో పొంగిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత తన స్నేహితురాలుని కలిసిన ఆనందం ఆమెకు అంతా ఇంతా కాదు. ఎదురెళ్లి ఆమెకు మర్యాదలు చేసి గౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. మంత్రి రోజా రమ్యకృష్ణ కి తన ఆఫీసు రూమ్, ఇల్లు అన్ని దగ్గరుండి చూపించి..

See also  Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

ramya-krishna-went-to-minister-roja-selvamani-house-video-became-viral

ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ కలిసి నటించినప్పుడు.. అప్పటి ముచ్చట్లు, సరదాలు అన్ని మాట్లాడుకుని.. ఎంతో ప్రశాంతంగా నవ్వుకున్నారు. ఆ తర్వాత రమ్యకృష్ణ కి రోజా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని చూపిస్తూ.. దాని గురించి, దాని విశ్లేషణ చేస్తూ.. అలాగే ఆమె తోటలో మొక్కలు అన్నీ చూపించి.. ఆ తర్వాత తెలుగింటి ఆడపడుచు ఇంటికి వచ్చినట్టుగా భావించి.. రమ్యకృష్ణ కి పూజ గదిలోకి తీసుకెళ్లి పట్టు చీర పెట్టి.. బొట్టు పెట్టి.. తాంబూలం ఇచ్చి మర్యాద చేశారు. అలాగే రమ్యకృష్ణ కూడా ఎంతో ఆనందంగా పొంగిపోయి.. వాటిని అందుకుని.. రోజాకి కూడా బొట్టు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని రోజా ఎంతో ఆనందంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మేము ఎన్నాళ్లకు కలిసాము అన్నది కాదు.. కలిసినప్పుడు మేము పొందిన ఆనందమే ముఖ్యమంటూ ఆమె పోస్ట్ చేయడం జరిగింది.