Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు ఎవరు అంటే అది రాంగోపాల్ వర్మ అని ఎవరైనా చెప్తారు. ఎందుకంటే రాంగోపాల్ వర్మ సినిమా అంటే అంత సంచలనం. ఆయన చేసే ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కోణంలో ఉంటుంది. ఒక రెండు తరాల తర్వాత చూడాల్సిన సినిమాని ఇప్పుడే చూపించే విధంగా ( Ram Gopal Varma and Sridevi ) సెన్సేషన్ క్రియేట్ చేయగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. నిన్న అనిమల్ ప్రీ రిలీజ్ వేడుకల్లో కూడా అగ్ర దర్శకుడైన రాజమౌళి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో సంచలనాన్ని క్రియేట్ చేస్తూ డిఫరెంట్గా తీగలిగే దర్శకులు అంటే నాకు రాంగోపాల్ వర్మ గుర్తుకొస్తారని చెప్పడం జరిగింది. రాంగోపాల్ వర్మ ఎన్ని హిట్స్ కొట్టాడు, ఎన్ని డిజాస్టర్స్ ఇచ్చాడు అన్నది కాదు గాని.. ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం సినిమా ఇండస్ట్రీలో ఉందన్న విషయం అర్థమవుతుంది.
అయితే రాంగోపాల్ వర్మ పై ఎప్పుడూ అనేక కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని మంచిగా ఉంటే, కొన్ని విమర్శ పూరితంగా ఉంటాయి. రాంగోపాల్ వర్మ ఉమనెయిజర్ అని అంటారు కానీ.. అతను తెలుగులో సినిమాలు చేసినప్పుడు అలాంటి క్యారెక్టర్ ఎక్కడ కనిపించలేదు. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాతే అతనులో డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది అని ఆయన అభిమానులు అంటారు. ఇక రామ్ గోపాల్ వర్మ తెలుగులో శివ సినిమా తీసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఆ రోజుల్లో ఆ సినిమా రికార్డును బద్దలు కొట్టే విధానాన్ని చూసి.. ఆయనతో ( Ram Gopal Varma and Sridevi ) హీరోగా ఒక సినిమా చేయాలని అందరూ అనుకునేవారు. ఇకపోతే రాంగోపాల్ వర్మ పర్సనల్ లైఫ్ కి వస్తే.. రాంగోపాల్ వర్మ తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని.. చాలాసార్లు చెప్పడం జరిగింది. ఆమెని లవ్ చేసానని ఇంటర్వ్యూ లలో చెప్పడం కూడా జరిగింది కానీ.. ఆమె దగ్గరికి వెళ్లి లవ్ చేసాను అని చెప్పే అర్హత నాకు లేదని.. అందుకే చెప్పలేదని అన్నారు.
శ్రీదేవిని ప్రేమించాలంటే.. ప్రేమించేస్తే సరిపోదు మనం ఎవరినైనా ప్రేమించాము అంటే వాళ్ళ అర్హతకు తగ్గ ఎత్తు మనం ఎదగాలి. ఆ తర్వాతే మనం ప్రేమించామని చెప్పినా వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారు. అసలు మనకు అర్హత లేకుండా ప్రేమించాను అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అన్న విషయం రాంగోపాల్ వర్మ కి తెలుసని చెప్పారు. ఇక రాంగోపాల్ వర్మ తెలుగులో తీసిన శివ సినిమాతో నాగార్జున, అమల పరిచయమై అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకున్న సంగతి మాకు తెలిసిందే. అలాగే రాంగోపాల్ వర్మ ప్రేమించిన ( Ram Gopal Varma and Sridevi ) శ్రీదేవితో కూడా రెండు సినిమాలు తీయడం జరిగింది. ఒకటి క్షణక్షణం, రెండు గోవింద గోవిందా.. క్షణం క్షణం సినిమాలో శ్రీదేవితో ఒక స్పెషల్ యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించాడు రాంగోపాల్ వర్మ. ఆమె ఆ వయసులో అమాయకత్వం, మాటలతో అమాయకత్వంగా నటిస్తూ మాట్లాడిన మాటలు అప్పట్లో సెన్సేషన్ అయ్యాయి.వెంకటేష్ పక్కన శ్రీదేవి అంత చక్కగా సెట్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం నిజంగా రాంగోపాల్ వర్మ ట్యాలెంట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు.
అలాగే నాగార్జున, శ్రీదేవి కాంబినేషన్లో రాంగోపాల్ వర్మ గోవింద గోవిందా సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంతలా ప్రేమించిన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు శ్రీదేవికి ప్రేమిస్తున్నానని చెప్పలేదు. కానీ బయట ఇంటర్వ్యూలో మాత్రం చెప్పడం జరిగింది. శ్రీదేవిని ప్రేమిస్తే ఎందుకు వెళ్లి చెప్పలేదు అంటే అర్హత లేదు అన్న విషయం రాంగోపాల్ వర్మ చెప్పడం జరిగింది. ఆమె అంత అందంగా ఉంటుంది. నేను నా ముఖం చూస్తే నాకే అసహ్యం వేస్తుంది. అలాంటిది నేను వెళ్లి ఆమెకు ఎలా చెప్పగలను? ఇంకా ఆమె నాకంటే హైట్ గా ఉంటుంది.. ఇలా ఎన్నిట్లోనో ఆమె నాకంటే బెస్ట్ గా ఉంటుంది. నేను ఆమె దగ్గరికి వెళ్లి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. మొత్తానికి రాంగోపాల్ వర్మ శ్రీదేవి అందం దగ్గర ఆయన ముఖం చూస్తే తనకి అసహ్యం వేసేలా ఉంటుందని.. రాంగోపాల్ వర్మ అలా శ్రీదేవి పై మనసు పడినా కూడా చివరికి ఆయన ముఖం చూస్తే ఆయనకే అసహ్యం ఫీలింగ్ తో శ్రీదేవిని మర్చిపోయారు అన్నమాట..