Ram Charan-Upasana : రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకుని 11 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులయ్యారు. ఇన్నేళ్ల తర్వాత కలిగిన ఆనందం మెగా కుటుంబంలో రామ్ చరణ్ ఉపాసన పనుల్లో అన్నిట్లోనూ కనిపిస్తుంది. ఇక మెగా అభిమానులైతే వాళ్ల కుటుంబం వాళ్ళ హీరోల కుటుంబం అంతా ఆనందంగా ఉన్నందుకు ( Upasana made a special room for Klin Kaara ) ఎంతో గర్వంతో పొంగిపోతున్నారు. రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఉపాసన ప్రతి విషయంలో కూడా ఎంతో ప్లాన్ గా ఉండే మనిషి. ఆమె ప్రతి నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే చాలా బాధ్యత కూడా ఉంటుందన్న విషయం చాలామంది చెప్పుకుంటూ ఉంటారు.
ఉపాసన పిల్లల విషయంలో ఎప్పుడూ కూడా తొందరపడలేదు. ఎంతోమంది ఇంకా పిల్లలు పుట్టలేదని ఆమెను ఎన్ని కామెంట్లు చేసినా కూడా ఆమె పట్టించుకోలేదు. ఎప్పుడు పిల్లల్ని కనాలి? ఎప్పుడు పిల్లల్ని కంటే వాళ్ళకి పూర్తి టైం, స్పేస్ అన్ని ఇవ్వగలం అని ఆలోచించుకుని ఆమె అనుకున్న దాన్నిబట్టే అన్ని నడిపించుకుంటూ వచ్చింది. భగవంతుడు ( Upasana made a special room for Klin Kaara ) దయవల్ల ఆమె అంత బాధ్యత ఉన్న మనిషి కాబట్టి.. ఆమె కోరుకున్నట్టుగానే.. ఆమెకు నచ్చిన టైంలో.. బంగారం లాంటి బిడ్డని కలిగించాడు ఆ దేవుడు. మెగా కుటుంబానికి సెంటిమెంట్ అయిన మంగళవారం నాడు మహాలక్ష్మిలా ఆ ఇంట్లో క్లిం కార అమ్మవారి నామాలతో అడుగుపెట్టింది.
ఇదిలా ఉంటే క్లిం కారా పుట్టిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ కూడా మనవరాలు పుట్టిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టూర్ వెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఇక రామ్ చరణ్ అయితే తన భార్య కడుపుతో ఉన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ.. డెలివరీ అయిన తర్వాత కూడా నెల రోజులపాటు ( Upasana made a special room for Klin Kaara ) ఇంటిపట్టునే తన బేబీతోనే ఉంటూ.. ఎంతో చక్కగా ఆ ప్రతి క్షణాన్ని ఆనందంతో అనుభవిస్తున్నాడు రామ్ చరణ్. అయితే క్లిం కారా పుట్టి నెలరోజులు కాకముందే రాంచరణ్ ఉపాసనలు ఏం చేశారో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. తల్లిదండ్రులకి పిల్లల మీద ఇంత ఇష్టం, ప్రేమ, బాధ్యత అనేది ఎంత ఉంటుందో అందరికీ ఉంటుంది కానీ.. ఎంత జనరేషన్ మారుతున్న, ఎంత కంప్యూటర్ కాలం వచ్చి టెక్నాలజీ పెరుగుతున్న కూడా.. అమ్మానాన్నలు ఎప్పుడు అమ్మ నాన్నలే అనిపిస్తుంది.
క్లీన్ కారా కోసం రామ్ చరణ్ ఉపాసన ఒక స్పెషల్ రూమ్ తయారు చేయించారు. ఆ చిన్నారి పెరుగుతుంటే వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేలాగా అన్ని డిజైన్ చేయిస్తున్నారు. వివిధ యానిమల్స్ బొమ్మలు, చెట్లు ఉండే బోర్డులు వైట్ థీమ్ లో ఉండే సోఫాలు, టేబుల్స్ ఇలా అత్యాధునిక లుక్కుతో రూమ్ లో డిజైన్ చేయిస్తున్నారు. అలాగే రూమ్ లో ఉండే కబోర్డ్స్ కు వివిధ జంతువులు బొమ్మలు అలంకరించారు. ఈ మొత్తం రూమ్ ఇంటీరియర్ డెకరేషన్ను బెస్ట్ ఆర్కిటెక్ట్ పవిత్ర రాజారామ్ తో చేయించారు. ఈ రూమ్ కి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో ఉపాసన స్వయంగా రిలీజ్ చేసి.. తన పాప కోసం అలాంటి రూమ్ తయారు చేసినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.