Home Cinema Ram Charan: ఆస్కార్ అవార్డు తరవాత రామ్ చరణ్ ఆస్థి విలువ ఎంతో తెలిస్తే.. షాక్...

Ram Charan: ఆస్కార్ అవార్డు తరవాత రామ్ చరణ్ ఆస్థి విలువ ఎంతో తెలిస్తే.. షాక్ అవుతారు..

Ram Charan property value after Oskar Award: చిరుత సినిమాతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన కెరియర్ ని మొదలు పెట్టాడు. మొదటి సినిమా హిట్ అయినప్పటికీ అదంతా చిరంజీవి క్రేజ్ వలన అనే పేరు వచ్చింది. ఆ తరవాత మగధీర సినిమా తో, చిరంజీవికి తగ్గ వారసుడు అని రామ్ చరణ్ ని అనుకున్నారు. అలాగే ఇప్పడు ఆర్ఆర్ఆర్ నాటు నాటు అనే పాట కి ఆస్కార్ అవార్డు రావడంతో చిరంజీవిని మించిన తనయుడు అని అనిపించుకున్నాడు రామ్ చరణ్. రాజమౌళి సినిమాలో నటించడం అంటేనే కష్టపడే గుణం, సహనం అనేవి ఉండాలి. అలాంటిది ఆయన సినిమాతో ఆస్కార్ అవార్డు ని కొట్టాలంటే ఇంకెంత కష్టం, సహనం చూపించి ఉంటాడో రామ్ చరణ్ ఊహించవచ్చు. నేనొక మెగాస్టార్ చిరంజీవి కొడుకుని నేనెందుకు అంత కష్టపడటం అని ఆలోచించకుండా, తన పని తానూ నిరంతర కృషితో చేసుకుంటూ వచ్చాడు.

See also  Bhola Shankar : భయంతో చేసాను.. నాకు నచ్చింది చేసాను తప్పేంటి?

ram-charan-property-value-after-oskar-award

అందుకే ఈరోజు రామ్ చరణ్ ( Ram Charan property value after Oskar Award ) ఆ స్థాయిలో ఉన్నాడు. ఈరోజు మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. అలాగే చిరు కష్టంతో సినిమా ఇండస్ట్రీ లో మోపిన పాదం, ఈరోజు ఎంత పెద్ద శిఖరాన్ని ఎక్కిందో ఆయన చూడగలగడం ఆయన శ్రమకి భగవంతుడు ఇచ్చిన వరం అని అనుకోవాలి. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆస్థి విలువ గురించి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఆస్తి విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రామ్ చరణ్ హీరోగానే కాకూండా చిరంజీవి హీరోగా నటించిన తన 150 వ సినిమా ఖైదీ నెంబర్ 150 కి ప్రొడ్యూసర్ గా కూడా రామ్ చరణ్ సక్సెస్ అయ్యి బాగా సంపాదించాడు. సినిమాల్లో నటించడం, సినిమాలను ప్రొడ్యూస్ చెయ్యడంతో ఊరుకోలేదు మన హీరో.

See also  Jr NTR : నువ్వంటే నాకు ఇష్టమే గాని.. భరించడమే చాలా కష్టం అంటున్న జూనియర్ ఎన్టీఆర్..

ram-charan-property-value-after-oskar-award

రామ్ చరణ్ చాలా ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఫ్రూటీ, అపోలోజియా, వోలానో, పెప్సీ, టాటా డొకోమో, హీరో మోటో క్రాప్ వంటి దాదాపు 33 బ్రాండ్లకు రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసారు. రామ్ చరణ్ నెలసరి ఆదాయం 3 కోట్లు పైనే ఉంటాదని అంచనా వేస్తున్నారు. సినిమాలు,వ్యాపారాల ద్వారా దాదాపు 1370 కోట్ల ఆస్తిపాస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఎక్కువ టాక్స్ కడ్తున్నది కూడా రామ్ చరణే నంట. ఇకపోతే రామ్ చరణ్ సంపాదన మాత్రమే కాకుండా తన తండ్రి చిరంజీవి సంపాదనకు కూడా ఏకైక వారసుడు కాబట్టి, అది కూడా కలుస్తాది. రామ్ చరణ్ కి జూబ్లీహిల్స్ లో ఉన్న ఇల్లు 38 కోట్లు ఉంటాది. ఇంకా ముంబైలో రామ్ చరణ్ కి పెంట్ హౌస్ కూడా ఉందని అంటున్నారు. రామ్ చరణ్ కి సొంత జెట్ విమానం కూడా ఉంది.

See also  Nayanthara : షారుఖ్ ఖాన్ మీద నయనతార చేసిన అలాంటి కామెంట్స్ వైరల్..

ram-charan-property-value-after-oskar-award

మెగా స్టార్ కొడుగ్గా, ఒక స్టార్ హీరోగా ఇప్పటికే ఇంత సంపాదిస్తే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నాటు నాటు లో డాన్స్ తో పరిచయం అయిన రామ్ చరణ్ ఇంకెన్ని వ్యాపారాలు చేసి, ఇంకెన్ని ప్రపంచ వ్యాప్త ప్రొడక్ట్స్ బ్రాన్డ్ అంబాసిడర్ గా చేసి.. సంపాదించుకునే అవకాశాలు పెరిగిపోయాయో చూడండి. ఇప్పుడున్న ఆస్తులు మొత్తానికి, ఆస్కార్ తో డబుల్ అయినట్టని నెటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు.