Balakrishna – Ram Charan : నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలో ఆయన సాధించిన ఘన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో నందమూరి వారసుడిగా ఆయన సృష్టించిన రికార్డ్స్ ( Balakrishna and Ram Charan ) ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాకుండా.. టీవీ లైవ్ షోస్ లో కూడా ఆయన ఎంత బాగా యాక్టివ్గా ఉండి ఆ ప్రోగ్రాం ని ఎంత సక్సెస్ఫుల్ చేస్తున్నారనడానికి సాక్ష్యంగా నిలబడిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రాం లో బాలకృష్ణ వాక్చాతుర్యంతో సెలబ్రిటీస్ అందరితో ఎన్నో మాటలు మాట్లాడించి.. ఆయన ఎన్నో మాటలు మాట్లాడి.. అందరితో ఆహా అనిపించేలాగా ఆ ప్రోగ్రాంని మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా నడిపిస్తున్నారు బాలయ్య.
60 ఏళ్ళు వయసులో కూడా బాలకృష్ణ ఇంకా అఖండాలాంటి సినిమాలతో అందరిని అలరిస్తూ, సినిమా రికార్డ్స్ సృష్టిస్తున్న హీరో బాలకృష్ణ. అయితే ఇప్పుడు బాలకృష్ణకి రామ్ చరణ్ వలన పెద్ద నష్టం జరిగిందని అనేక వార్తలు సోషల్ మీడియా వస్తున్నాయి. రాంచరణ్ ఏంటి బాలకృష్ణకి నష్టం చేయడం ఏంటి? అసలు ( Balakrishna and Ram Charan ) ఎందుకు బాలకృష్ణ నష్టపోయాడు అని అనుకుంటున్నారా? అవును భారీ నష్టమే వచ్చింది అని అనుకోవచ్చు. రామ్ చరణ్ సినీ కెరియర్లోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్దపీఠం వేసుకుని కూర్చున్న సినిమా మగధీర. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి మనకి తెలిసిందే.
రామ్ చరణ్ జీవితంలో ఇంత గొప్పగా చెప్పుకునే ఈ సినిమా గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అసలు మొదట ఆ సినిమాలో హీరోగా నటించాల్సిన వాడు బాలకృష్ణ అంట. బాలకృష్ణ దగ్గరికి రాజమౌళి కథ తీసుకొని వెళ్లి.. ఆయనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడంట. కథ మొత్తం విన్న తర్వాత బాలకృష్ణకి ఆ సినిమా కథ చాలా నచ్చింది కానీ, కొన్ని అనివార్య కారణాల వలన చాలా సున్నితంగా నో అని చెప్పాడంట బాలయ్య. ఇక బాలకృష్ణ నో చెప్పిన తరుణంలో ఏం చేయాలో తోచక అల్లు అరవింద్ దగ్గరికి వెళ్లి రామ్ చరణ్ కోసం ఈ కథని రాజమౌళి చెప్పాడంట. ఆ తర్వాత జరిగిన కథ మనందరికీ తెలిసిందే. ఇక మగధీర సినిమా ఎన్ని కోట్లు సంపాదించి పెట్టిందో.. ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిందో.. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత అద్భుతమైన పేరుతో ఆ సినిమా నిలిచిందో మనందరికీ తెలిసిందే.
ఇంత గొప్ప సినిమా బాలయ్య ఖాతాలోకి వెళ్లాల్సింది వెళ్లలేక వెళ్లకుండా పోయింది. అంతేకాదు అసలు రాజమౌళి ఈ కథను రాసుకున్నదే బాలకృష్ణ కోసమైతే.. ఇక బాలకృష్ణ చెయ్యను అనడంతో రాజమౌళి అడ్జస్ట్ అయ్యి.. రామ్ చరణ్ తో చేస్తేనే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చిన రాజమౌళి.. ఏ హీరోని ఊహించుకొని ఆ కథను రాశాడో, ఆ హీరో ఒప్పుకొని చేసి ఉంటే ( Balakrishna and Ram Charan ) ఇది అప్పట్లో ఇంకెంత పెద్ద రికార్డు అయ్యి బాలకృష్ణ జీవిత చరిత్రలో అదొక రికార్డ్ మిస్ అవకుండా ఉండును. కానీ రామ్ చరణ్ కి మగధీరతో రాజమౌళితో ఆ లింకు రాసిపెట్టి ఉండడం వల్ల అది అలా జరిగిందంతే.. ఇంతకీ ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.