Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా రంగంలో ఎంతగానో చెప్పుకో తగ్గ గొప్ప వ్యక్తి. ఈయన ఒంటరిగా సినిమా రంగంలో అడుగు పెట్టి ఈరోజు ఎంతటి ఘనవిజయాన్ని సాధించారో మనందరికీ తెలిసిందే. 68 ఏళ్ల వయసు ( Ram Charan announces Chiranjeevi ) ఉన్న చిరంజీవి ఇప్పటికీ ఈ తరం హీరోలకు పోటీగా, దీటుగా స్టెప్పులు వేస్తూ.. వాళ్లకి ఎప్పుడు భయాన్ని పుట్టిస్తూనే ఉంటాడు. చిరంజీవితో పోల్చుకోవడం అంటే అప్పట్లో చిన్న కుర్రాడి నుంచి.. ఇప్పటికి స్టార్ హీరో వరకు అందరికీ ఇష్టమే. అంత స్టార్ డం ఉన్న చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే చిరంజీవి పర్సనల్ పరంగా చూసుకుంటే ఆయన ఏకైక వారసుడు సినీ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ చిరంజీవి తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. ఆయన నేమ్ ఫేమ్ తో సినీ అభిమానుల సంపాదించుకొని, ఆ తర్వాత తనదైన శైలిలో తనకి తాను ఎదుగుతూ.. అభిమానులను సంపాదించుకొని.. ఈరోజు ( Ram Charan announces Chiranjeevi ) భారతదేశ మొత్తం, యావత్ ప్రపంచంలో కూడా.. తన పేరుని మారు మ్రోగేలా చేసుకున్నాడు రామ్ చరణ్. ఇదంతా కేవలం తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని, స్వయంకృషితో.. తనకి తాను కష్టపడుతూ, తనని తాను నిరూపించుకోవడానికి ఎప్పటికప్పుడు తనని తాను చేసుకునే అప్డేట్ లోనే తన సక్సెస్ ఉంది. కాశ్మీర్లో జరుగుతున్న జి 20 సదస్సులకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ వెళ్లడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా రామ్ చరణ్ అక్కడ అనేక ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.
రామ్ చరణ్ ఇండియన్ సినిమా గురించి అక్కడ ఎంతో గొప్పగా చెప్పి అభిమానుల మన్ననలను పొందాడు. అలాగే తన తండ్రి చిరంజీవి గురించి మాట్లాడుతూ.. తన సక్సెస్ కి కారణం చిరంజీవి అని, ఆయన వయసు 68 సంవత్సరాలు వచ్చినప్పటికీ.. ఇంకా ఎంతో కష్టపడుతూ .. తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటూ.. చాలా వర్క్ అవుట్ చేస్తూ.. మా అందరికీ చాలా ఆదర్శంగా ఉంటారని చెప్పారు. ప్రస్తుతం చిరంజీవి ( Ram Charan announces Chiranjeevi ) బోలా శంకర్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి ఇంకేమి సినిమాలు చేస్తాడని గాని అప్డేట్స్ రాలేదు. అయితే అందరూ చిరంజీవి మనవడు పుట్టిన తర్వాత కొంతకాలం మనవడుతో ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తాడు సినిమాలకి అని అనేక కామెంట్లు చేయడం, వార్తలు రావడం జరిగింది.
వీటన్నిటికీ సమాధానంగా జీ20 లో పాల్గొన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలలో.. రామ్ చరణ్ అందరు సమక్షంలో చిరంజీవి అప్డేట్స్ కొన్ని చెప్పారు. చిరంజీవి ఇంకొక నాలుగు సినిమాలు సైన్ చేశారని, ఆ నాలుగు సినిమాలు డీటెయిల్స్ అతి త్వరలోనే ఇస్తారని చెప్పాడు. దీంతో చిరంజీవి ఒకేసారి నాలుగు సినిమా చేయబోతున్నాడని.. ఆ నాలుగు సినిమాలకు దర్శకుడు ఎవరు? హీరోయిన్స్ ఎవరో? ఎలాంటి ప్రాజెక్టు? అని మెగా అభిమానులు కుతూహలంతో ఉన్నారు. మొత్తానికి బోలాశంకర్ తరవాత సినిమాలు ఇప్పట్లో చేయదని.. చిరంజీవి పై ఉన్న అభిప్రాయాన్ని పోగొట్టి.. చిరంజీవి నాలుగు సినిమాలకు సిన్ చేశాడన్న సీక్రెట్ ని.. రామ్ చరణ్ అంత మంది ఎదురుగా పబ్లిక్ చేశాడు.