Home Cinema Ram Charan – Upasana: రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీలో సూపర్ సీక్రెట్స్ అవుట్.....

Ram Charan – Upasana: రామ్ చరణ్ ఉపాసన లవ్ స్టోరీలో సూపర్ సీక్రెట్స్ అవుట్.. దేవుడా మరీ ఇంత రొమాంటిక్ గా!

ram-charan-and-upasana-love-story-details-came-out

Ram Charan – Upasana: మెగాస్టార్ చిరంజీవి ఏకైక తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమా రంగంలో ఎందరో హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ( Ram Charan and Upasana love story ) రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీ తో ఎటువంటి సంబంధం లేని ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. రామ్ చరణ్, ఉపాసన ప్రేమించుకుని.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఎంతో వైభవంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళ జంటలో ఎంతో అన్యోన్యత కనిపిస్తాది.

ram-charan-and-upasana-love-story-details-came-out

అసలు రాంచరణ్ ఉపాసన ఒకరినొకరు ఎప్పుడు ఎలా ప్రేమించుకున్నారు? వీళ్లిద్దరిలో ఎవరికి ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? వీళ్లిద్దరిలో ఎవరెవరికి ఫస్ట్ గిఫ్ట్ కొనిచ్చారు? ఇలా ఎన్నో అనుమానాలు రామ్ చరణ్ అభిమానుల్లో కలుగుతుంది. రామ్ చరణ్ ( Ram Charan and Upasana love story ) లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంటారు మెగా అభిమానులు. కానీ ఎప్పుడూ కూడా రామ్ చరణ్ లవ్ స్టోరీ పెద్దగా బయటికి రాలేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం రామ్ చరణ్ లవ్ స్టోరీ లో ఉన్న అనేక సీక్రెట్స్ బయటకు వచ్చాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ ఉపాసన చదువుకునే రోజుల్లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఇద్దరికీ ఒకరితో ఒకరికి పరిచయం ఉందంట.

See also  Priyamani: ఏ స్టార్ హీరోని ప్రేమించడం వలన ప్రియమణి ఇంతవరకు పిల్లల్ని కనలేదో మీకు తెలుసా.?

ram-charan-and-upasana-love-story-details-came-out

కానీ అప్పట్లో వాళ్ళిద్దరూ ఏమీ పెద్దగా మాట్లాడుకోలేదంట. ఆ తర్వాత ఉపాసన పై చదువులకు విదేశాలకు వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకు అక్కడ ఆమె చదువు కంప్లీట్ చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చేసింది. అప్పటికి రామ్ చరణ్ సినిమా ( Ram Charan and Upasana love story ) ఇండస్ట్రీలో అడుగుపెట్టి చిరుత సినిమా చేసి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అయ్యి.. ఆ తర్వాత మగధీర సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఒప్పుకోవడం జరిగింది. అయితే రామ్ చరణ్ ఉపాసన మళ్లీ హైదరాబాద్లో స్పోర్ట్స్ క్లబ్లో మీటింగ్లో కలిశారంట. అప్పుడు ఒకరిని ఒకరు చూసుకొని ఆ చూపుల్లో ఇద్దరు ఇష్టపడి ఒకరి నెంబర్లో ఒకరు తీసుకొని ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టారంట. ఆ ఫ్రెండ్షిప్ కాస్త బాగా పెరిగి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందంట.

See also  Sai Pallavi: సాయి పల్లవి ఇలాంటి పని అలా ఎలా చేసింది.?

ram-charan-and-upasana-love-story-details-came-out

అయితే వీళ్ళిద్దరిలో ఉపాసన మొదటిసారిగా రామ్ చరణ్ కి ప్రపోజ్ చేసింది అంట. ఉపాసన ప్రపోజ్ చేయగా వెంటనే రామ్ చరణ్ కూడా ఒప్పుకున్నాడంట. ఎందుకంటే.. రామ్ చరణ్ ని కూడా అప్పటికి ఉపాసన ఇష్టపడుతున్నాడంట. ఉపాసన ప్రపోజ్ చేయడం ఫస్ట్ చేసింది గాని.. గిఫ్ట్ మాత్రం ఫస్ట్ రామ్ చరణ్ ఉపాసనకి హాట్ సింబల్ ఉన్న ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఇచ్చాడంట. ఆ గిఫ్ట్ చూసి ఉపాసన చాలా పొంగిపోయిందట. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొకరు అనేక బహుమతులు ఇచ్చుకోవడం జరిగిందట. అలా వీళ్ళిద్దరూ ఐదు సంవత్సరాలు ప్రేమించుకుని.. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి మ్యారేజ్ చేసుకున్నారంట. ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్త అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. 2012లో రామ్ చరణ్ ఉపాసన పెళ్లి జరిగింది. ఇటీవలే వీళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టగా ఆ పాపకు క్లీన్ కారా అని పేరు కూడా పెట్టారు.