Rakul Preet Singh: కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగులో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో స్టార్ క్రేజ్ ను సంపాదించుకుంది. పెద్ద స్టార్ హీరోల చెంత నటించిన రకుల్ ప్రీత్ తెలుగులోనూ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ క్రేజ్ బ్యూటీగా రకుల్ ప్రీత్ సింగ్ తన పేరును సంపాదించుకుంది. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే దృష్టి సాగిస్తుంది.
తెలుగులో మంచి హీరోయిన్గా గుర్తింపు పొందిన తర్వాత ఇక్కడ ఆఫర్లు సైతం లెక్కచేయకుండా బాలీవుడ్ లోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తుంది. సౌత్ లో గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలు వచ్చాయి. కానీ అవేమీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో రకుల్ చత్రివాలీ మూవీతో పలకరించింది. ఈ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రలో నటించిన రకుల్ నేరుగా ఓటీపీ ప్లాట్ఫారంలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
బాలీవుడ్ నిర్మాత, నటుడు అయినటువంటి జాకీ భగ్నానితో గత కొద్ది కాలంగా రకుల్ ప్రేమ నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి ప్రేమ గురించి అందరికీ తెలిసిపోయింది. రకుల్ ప్రీత్ స్వయంగా జాకీతో ప్రేమలో ఉన్నానని తెలిపింది. కాస్త ఖాళీ టైం దొరికితే వీళ్ళిద్దరూ డిన్నర్, డేట్స్, వెకేషన్స్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది రకుల్ జాక్ ఏడడుగులు వేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం జోరుగా ప్రచారం సాగుతుంది.
కాగా ఈ విషయంపై రకుల్ ఫైనల్ గా ఓపెన్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ పెళ్లి ప్రస్తావన ఎత్తగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టి పారేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పెళ్లి కాదు దేని గురించి ఆలోచించేంత సమయం లేదు అంటూ తెలిపింది. మొత్తానికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రకుల్ తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరియర్ పై రాబోయే చిత్రాలపైనే ఉందని ప్రతి స్క్రిప్ట్ జాగ్రత్తగా చదువుతానని రకుల్ వెల్లడించింది.