
Raksha Bandhan 2023 : ప్రతి బంధానికి ఒక రోజు అనేది ఉంటుంది. ఆ రోజున కోసం ఆ బంధంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. అలాగే మన భారత దేశంలో అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్లు ఎదురుచూసే ముఖ్యమైన రోజు ( Raksha Bandhan 2023 festival ) రక్షాబంధన్ ఈ వేడుక రోజు అన్నదమ్ముల దగ్గరకు ఆడబడుచులు వెళ్లి రాఖీ చేతికి కట్టి నాకు రక్షగా, తోడుగా ఉండు అని అడగ్గా.. అన్నదమ్ములు బహుమతులు ఇచ్చి నీకు నేనున్నానంటూ ధైర్యం చెప్పే ఈ అందమైన పండుగని జరుపుకోవడం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందుకే ఏడాదంతా ఎవరు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా.. ఈరోజు నాడు ఒకరినొకరు కలుసుకొని వాళ్ళ బంధానికి ఉన్న ప్రాముఖ్యతని.. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుని ఆనందించే గొప్ప రోజు రక్షాబంధన్.
సాధారణంగా ఏ పండుకైనా పలానా రోజు అని ముందుగానే తెలుస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని కారణాల వలన ఆ పండుగని ఏరోజు చేసుకోవాలి అనే దాని మీద అనేక సందేహాలు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఏడాది ( Raksha Bandhan 2023 festival ) 2023లో వచ్చిన రాఖీ పండుగ మీద అందరికీ ఎన్నో సందేహాలు. శ్రావణమాసంలో వచ్చే ఈ రాఖీ పండుగ ఆగస్టు 30వ తేదీని అని కొందరు అంటుంటే కాదు 31న అని మరికొందరు అంటున్నారు. దీని మీద ఆరా తీయడం మొదలు పెడితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు.
దీనితో అందరిలోనూ ఒక సందేహం. రాఖీ పండుగ ఈ సంవత్సరం ఏరోజు చేసుకోవాలి అనే సందేహంతో ఇంటర్నెట్ లో నెటిజనులు తెగ వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రాఖీ పండుగ మీద ఏ రోజు చేసుకోవాలి ( Raksha Bandhan 2023 festival ) అనే దానిమీద యూట్యూబ్లో అనేక వీడియోలు వస్తూనే ఉన్నాయి. ఎన్ని చూస్తున్నా.. ఏమి చేస్తున్నా ఒక్కొక్కరూ చెప్పే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ తో ఒక్కొక్కరిలో ఒక్కొక్క అనుమానం,సందేహం. రాఖీ పండుగని శ్రావణమాసం పూర్ణిమ తిధినాడు వస్తుంది. ఆ రోజు ఈ వేడుకను చేసుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం రాఖీ పండుగని శ్రావణమాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు.
31ని చేసుకోవాలా అనే సందేహం చూస్తే.. బయటికి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాఖీ పండుగ ఎప్పుడు కూడా భద్రకాలం లేని కాలంలోనే జరుపుకోవాలి. రక్షాబంధన్ ఆగస్టు 30న మొదలవుతుంది. అయితే ఆ రోజున భద్రకాలం ఉంది ఆగస్టు 30న రాత్రి 9 గంటల వరకు భద్ర కాలం ముగుస్తుంది. అందువల్ల ఈ పండుగను ఆగస్టు 31న జరుపుకోవడం ఆమోదయోగ్యమని పండితులు చెబుతున్నారు. భద్రకాలంలో సోదరీమణుల తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాల ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలి. ఈ నేపథ్యంలో ఆగస్టు 31వ రోజున పండుగ జరుపుకోవాలని పండితులు అంటున్నారు. మరి దీన్ని బట్టి ఇంకా సందేహం ఉన్నవారు వారి దగ్గరలో ఉన్న పండితుల దగ్గరకు వెళ్లి తెలుసుకొని ఈ పండుగను శాస్త్ర ప్రకారం చేసుకోవడం మంచిదని అనుకుంటున్నారు..