Home Cinema Balakrishna : బాలక్రిష్ణని.. సూపర్ స్టార్ ఆ విషయంలో తిట్టాడా పొగిడాగా మీరు చెప్పగలరా?

Balakrishna : బాలక్రిష్ణని.. సూపర్ స్టార్ ఆ విషయంలో తిట్టాడా పొగిడాగా మీరు చెప్పగలరా?

Balakrishna: దివంగత నందమూరి తారక రామారావు తనయుడు నట వారసుడు నందమూరి బాలకృష్ణ అంటే ఇప్పటికీ సినిమా రంగంలో అభిమానుల్లో కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఇష్టం ఉందన్న సంగతి మనకు తెలిసిందే. బాలకృష్ణ సినిమా ( Rajanikanth’s speech about Nandamuri ) అంటే ఆ సినిమా కథ ఎలా ఉంది? పాటలు ఎలా ఉన్నాయి? గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే అందులో బాలకృష్ణ ఎంత హీరోవిజాన్ని చూపించాడు అనేది ఒక ఎత్తు. సినిమా కథ సారాంశం కథ మూలం రొటీన్ గా ఉన్నాయని అనిపించినా కూడా బాలకృష్ణ హీరోయిజం బాగా చూపిస్తే.. ఆ సినిమాని ఖచ్చితంగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. అలాగే ఇటీవల ఎన్టీఆర్ సత జయంతి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.

See also  Bhola Shankar : భయంతో చేసాను.. నాకు నచ్చింది చేసాను తప్పేంటి?

ఈ వేడుకలకు చంద్రబాబు నాయుడు బాలకృష్ణతో పాటు సెలబ్రిటీస్ ఎందరో వచ్చారు. వచినవారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వేడుకలకు రావడం జరిగింది. సాధారణంగా ఏ ఫంక్షన్ కైనా ఎవరైనా అటెండ్ అయితే ఆ వేడుక ఎవరి గురించి జరుగుతుందో వాళ్ల గురించి ఒక నాలుగు మాటలు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ సతజయంతి రోజు ( Rajanikanth’s speech about Nandamuri ) జరిగిన వేడుకల్లో ఎందరో ఎన్నో రకాలుగా ఆయన కొనియాడారు. ఒక్కొక్కళ్ళు వాళ్లకి ఉన్న అనుబంధం, అనుభూతులను అందరితో పంచుకున్నారు. అలాగే రజినీకాంత్ కూడా బాలకృష్ణ గురించి ఆయనకి బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. అయితే రజనీకాంత్ మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

rajanikanths-speech-about-nandamuri-balakrishna

ఏ విషయాన్ని అయినా మనం ఏ కోణంలోని చూస్తున్నాం అనేది చాలా ముఖ్యం. మనం చూసే కోణం మన అర్థం చేసుకునే దాన్నిబట్టి అక్కడ మాటలకు అర్ధాలు పరమార్ధాలు అనేవి కనిపిస్తాయి అలాగే రజినీకాంత్ మాట్లాడిన కొన్ని మాటలకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్ధాన్ని తీసుకున్నారు. రజినీకాంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలకృష్ణ నిజంగా ఒక అద్భుతం అని.. ఒక జీపుని ఎగిరి తన్నేయాలన్నా, కంటి చూపుతో ఎవరినైనా చంపేయాలన్నా, ఒక మనిషిని కొట్టడమో, ( Rajanikanth’s speech about Nandamuri ) చాలా సునాయాసంగా చేయడం.. విపరీత కరమైన ఫైట్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక బాలకృష్ణ సినిమాలో బాలకృష్ణ చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. బాలీవుడ్ హీరోలైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలాంటివి చేసిన కూడా అభిమానులు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు అని అన్నారు.

See also  Tamannaah: ప్రతి ఒక్కదానికి నిందలు వెయ్యడమే పనైపోయింది.. వాళ్ళపై భగ్గుమన్న తమన్నా..

rajanikanths-speech-about-nandamuri-balakrishna

రజినీకాంత్ మాట్లాడుతూ.. బాలకృష్ణ చేసిన సీన్స్ సినిమాల్లో మిగిలిన హీరోలు చేస్తే ఆడియన్స్ అస్సలు ఒప్పుకోరు గాని, బాలకృష్ణ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు లాగా బాలకృష్ణ కూడా ఒక యుగపు పురుషుడు అని అభిమానులు భావిస్తారు కాబట్టి అని రజనీకాంత్ అన్నారు. అయితే ఈ మాటలకు కొందరు నెటిజనులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. రజనీకాంత్ బాలయ్యని తిట్టాడు అని కొందరు.. బాలకృష్ణ సినిమాలో అంత నమ్మలేని పచ్చి అబద్ధాలని చిత్రీకరిస్తారని రజనీకాంత్ మాటల్లో అర్ధమని మరికొందరు వాళ్ళ తండ్రి లాగా అతను కూడా ఒక యుగపురుషుడని.. అందుకే ఆయన ఏం చేసినా కూడా జనాలు యాక్సెప్టెన్స్ చేస్తారని అదే బాలకృష్ణ గొప్పతనం అని పొగుడుతున్నాడని మరికొందరు అంటున్నారు.